సోను సూద్ సినిమాలలో నటించిన విలన్ గా కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ కరోనా లాంటి ఆపద సమయంలో ఎంతోమందిని తన సొంత డబ్బుతో ఆదుకున్న  సోనూసూద్ గురించి ఇప్పుడు చాలామందికి తెలిసింది.  సోను సూద్ కరోనా కష్ట  సమయంలో కార్మికులను ఆదుకున్న దయామయుడు. ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి దారి చూపుతున్న లీడర్..... రీల్ లైఫ్ లో విలన్ అయినప్పటికీ....రియల్ లైఫ్ లో హీరో అంటూ పేరు తెచ్చుకున్న గొప్ప మానవతావాది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయం నుండి తనలోని మంచితనాన్ని చాటుతూ పేదలకు అండగా నిలుస్తున్నాడు ఈ రియల్ హీరో... ఒకటి రెండు సహాయలతో సరిపెట్టుకోకుండా ప్రజల సంక్షేమం కోరుకునే ప్రతినిధిగా నాలుగైదు నెలల నుండి నిరంతరం ప్రజలకు సహాయక చర్యలను అందిస్తున్నారు సోనూసూద్. 




ఎంతో కష్టపడి పోగు చేసుకున్న ఆస్తి కరిగిపోతుంటే మీకు బాధగా లేదా అన్న ప్రశ్నకు..... ఆస్తి కన్నా మన తోటి మనుషులకు సహాయపడటం చాలా అవసరం... అయినా కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని ఇతరుల క్షేమం కోసం వినియోగించడం నాకు చాలా ఆనందం గా ఉంది అంటూ తన గొప్పతనాన్ని చాటుకున్నారు సోను. కరోనా కాలం మొదలైనప్పటి నుండి..... తన మంచి పనులతో వార్తల్లో హైలెట్ అవుతున్న సోనూసూద్ తాజాగా మరో మంచి కార్యం తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు..... 




ఇటీవలే సోను సూద్ జిరాఫీ తో కొంతసేపు గడిపారు... ఆ జిరాఫీ కి గడ్డి తినిపిస్తూ ఎంతో ఆనందంగా ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.... సాటి మనుషులకే కాదు.... తోటి ప్రాణులకు సహాయం చేయవలసిన అవసరం వస్తే ఏమాత్రం వెనుకంజ వేయరు సోనూసూద్ అంటూ.... ప్రశంసలతో అభినందిస్తున్నారు నెటిజన్లు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హంగామా చేస్తూ తెగ చక్కర్లు కొడుతోంది.... ఈ వీడియో చూసిన ప్రజలు "ఎంత మంచి వాడవయ్య"..... సోనూసూద్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు...



మరింత సమాచారం తెలుసుకోండి: