రాధే శ్యాం తర్వాత ప్రభాస్ 21వ సినిమా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైజయంతి బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణెని హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ సినిమాలో నటించేందుకు దీపికా 30 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. అయితే దీపికా పదుకొణె కూడా ఈ విషయాన్ని కన్ఫాం చేసింది. కాని నిర్మాతలు అడ్వాన్స్ ఇస్తా అంటే మాత్రం వద్దని చెప్పిందట.    

అదేంటి దీపికా ఎందుకు అడ్వాన్స్ ఎమౌంట్ వద్దన్నది అన్న దానికి కారణాలు తెలియట్లేదు. సినిమాకు ఇప్పుడు ఓకే చెప్పినా చివరి నిమిషంలో ఏదైనా తేడా కొట్టి కాదని చెబితే తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది అందుకే దీపికా అడ్వాన్స్ తీసుకోలేదని అంటున్నార్ సిని వర్గాలు. అయితే దీపికా అడ్వాన్స్ తీసుకోకపోడానికి మరో కారణం కూడా ఉందని అంటున్నారు. సినిమా స్టార్ట్ అయ్యాక తీసుకుంటే నిర్మాతకు కలిసి వస్స్తుంది కాని ఇప్పుడే అడ్వాన్స్ గా తీసుకుంటే నిర్మాత మీద అదనపు భారం పడుతుందని భావించి ఆమె అడ్వాన్స్ తీసుకోలేదని కొందరు అంటున్నారు.

ప్రభాస్ తో దీపికా ఆడియెన్స్ ఈ కాంబో ఫిక్స్ అయ్యారు. మరి నాగ్ అశ్విన్ సినిమా ఎలాంటి మార్పులు లేకుండానే తెరకెక్కితే బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఓం రౌత్ డైరక్షన్ లో బాలీవుడ్ లోనే ఆ సినిమా తెరకెక్కుతుంది. రాముడి పాత్రలో ప్రభాస్ రావణుడిగా సైఫ్ నటిస్తున్నారు.                                                              
 

మరింత సమాచారం తెలుసుకోండి: