ఫ్యామిలీ హీరోగా ఎన్నో అద్బుత చిత్రాల్లో నటించి, సూపర్‌ హిట్‌లను సాధించిన జగపతిబాబు ఆమధ్య వరుసగా ప్లాప్‌ అవుతూ వచ్చాడు. దాంతో హీరోగా ఇకపై సినిమాలు చేయవద్దు అని నిర్ణయించుకుని విలన్‌ పాత్రలను, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్లాలని భావించాడు. అందులో భాగంగానే ఈయన విలన్‌గా నటించిన ‘లెజెండ్‌’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం విజయం సాధించడంతో పాటు, జగపతి బాబుకు మంచి పేరు వచ్చింది. దాంతో ఆయనకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. జగపతిబాబుకు ఒక్క సారిగా పెరిగిన క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవాలని గతంలో జగపతిబాబు నటించి విడుదల కాకుండా ఉన్న చిత్రం ‘ఏప్రిల్‌ ఫూల్‌’ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు నిర్మాత జిఎల్‌ శ్రీనివాస్‌. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికి జగపతి బాబుకు ‘లెజెండ్‌’ వల్ల వచ్చిన క్రేజ్‌తో ఓపెనింగ్స్‌ రాబట్టవచ్చు అని భావించాడు. తాజాగా ఈ చిత్రంను విడుదల చేయగా చేదు అనుభవమే ఎదురైంది. జగపతి బాబుకు హీరోగా చివరి ఫ్లాప్‌గా ఈ చిత్రం నిలిచింది. కృష్ణస్వామి శ్రీకాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏప్రిల్‌ ఫూల్‌’ చిత్రంలో జగపతి బాబు సరసన భూమిక హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రం అంతో ఇంతో పర్వాలేదు అనిపించుకున్నా ఈ చిత్రం మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో భూమికకు కూడా తెలుగులో హీరోయిన్‌గా చివరి ఫ్లాప్‌ అనే చెప్పాలి. ఈ చిత్రంలో జగపతిబాబు, భూమిలక ముదురు రొమాన్స్‌ ప్రేక్షకులను విసిగించేలా ఉంది. ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్లే ఈ చిత్రంను చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులను ఫూల్‌ చేసే విధంగా ఉంది. ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనంతో ‘లెజెండ్‌’ వల్ల వచ్చిన క్రేజ్‌తో ముందుకు తీసుకు పోవాలనుకోవడం అత్యాశే అని విశ్లేషకులు చెబుతున్నారు. సినిమాలో మ్యాటర్‌ లేనిది ఇతర అంశాలు ఏం కాపాడ లేవు అని మరోసారి ఋజువైంది. ఈ చిత్రం తర్వాత మళ్లీ జగపతి బాబు హీరోగా వచ్చే అవకాశాలు లేవ అనే చెప్పాలి. ఇక ఈయన పలువురు స్టార్‌ హీరోల చిత్రాల్లో నటిస్తున్నాడు. మహేష్‌బాబు, మనోజ్‌, రామ్‌, సాయిధరమ్‌ తేజ్‌ వంటి హీరోల చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో ఈయన నటిస్తున్నాడు. ఇలా వరుసగా చిత్రాలు చేస్తున్న జగపతిబాబుకు ‘ఏప్రిల్‌ ఫూల్‌’ చిత్రం ఒక చేదు అనుభవము అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఆ చిత్రం విడుదల చేసి జగపతిబాబు క్రేజ్‌ను తగ్గించుకోవడం అయ్యింది. హీరోగా చివరి చిత్రం ఫ్లాప్‌ అయినా ఇకపై తను నటించబోయే చిత్రాలు అన్ని కూడా సక్సెస్‌ అవుతాయి అనే నమ్మకంతో జగపతి బాబు ముందడుగు వేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: