మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘క్రాక్’ చిత్రం షూటింగ్ కొంత భాగం బ్యాలన్స్ ఉంది. త్వరలోనే దానిని ఫినిష్ చెయ్యడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ చిత్రాన్ని కచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేయబోతున్నట్టు దర్శకుడు గోపీచంద్ మలినేని చాలా నమ్మకంగా చెబుతున్నాడు. అయితే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకొనే పరిస్థితి లేని పక్షంలో అది సాధ్యమేనా అనే డిస్కషన్లు కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా రవితేజ మాత్రం ‘క్రాక్’ ఫినిష్ చేసిన వెంటనే తన తరువాతి చిత్రం షూటింగ్లో కూడా జాయిన్ అవ్వడానికి రెడీ అయిపోతున్నాడు.

‘రైడ్’ ‘రాక్షసుడు’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన ర‌మేష్ వ‌ర్మ డైరెక్షన్లో రవితేజ ఓ చిత్రం చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. గతం లో రవితేజ రమేష్ వర్మ డైరెక్షన్ లో "వీర" అనే మూవీ కూడా చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరా జయాన్ని మూట గట్టుకుంది. ఇప్పుడు రవి తేజ రమేష్ వర్మ కి తనతో రెండవ సినిమా చెయ్యడానికి అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రానికి ‘కిలాడీ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌వితేజ డ్యూయెల్ రోల్ పోషించనున్నట్టు కూడా టాక్ నడుస్తుంది. అంతేకాకుండా కథ ప్రకారం ఈ చిత్రంలో మ‌రో యంగ్ హీరోకి కూడా ఛాన్స్ ఉందట.ఆ యంగ్ హీరో పాత్ర కోసం శ్రీ‌విష్ణు లేదా స‌త్య‌దేవ్ లను తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం.

అయితే శ్రీవిష్ణు ఇప్పుడున్న ఫామ్లో వేరే హీరో సినిమాల్లో చిన్న పాత్రలు చేసే అవకాశం లేదు. దాంతో సత్యదేవ్ నే ఫిక్స్ చేసే ప్రయత్నాలు చెయ్యమని రవితేజ దర్శకనిర్మాతలకు చెప్పినట్టు తెలుస్తుంది. నవంబర్ నుండీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతుందని సమాచారం.

నిజానికి సత్యదేవ్ శ్రీవిష్ణు కంటే కూడా మంచి టాలెంట్ వున్న నటుడు. అందుకు నిదర్శనం అతను చేసిన సినిమాలే. "బ్లఫ్ మాస్టర్" సినిమాలో అతని యాక్టింగ్ అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. అంత బాగా నటించాడు. కాబట్టి సత్యదేవ్ అయితేనే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: