ఇప్పటికే అరెస్టు అయిన సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ని విచారిస్తున్నారు అధికారులు. ఇటీవలే డ్రగ్స్ కేసులో సుశాంత్ ప్రియురాలు అరెస్టయిన విషయం తెలిసిందే. రియా చక్రవర్తి విచారణలో భాగంగా మరిన్ని సంచలన నిజాలు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే డ్రగ్స్ రాకెట్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు సారా అలీ ఖాన్ ల పేర్లు కూడా కూడా తెరమీదకు రావడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. వీరే కాకుండా మరో 25 మంది పేర్లు కూడా రియా చక్రవర్తి విచారణలో బయట పెట్టినట్లు తెలుస్తోంది.
దీంతో ప్రస్తుతం రియా చక్రవర్తి కేసులో బయటపడ్డ నిజాలు అటు బాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు సౌత్ ఇండస్ట్రీని కూడా వనికిస్తున్నాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో భాగంగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి 25 మంది సినీ ప్రముఖుల పేర్లు బయటపెట్టినట్లు మీడియాలో కథనాలు వస్తుండగా.. వీరిలో బాలీవుడ్ అగ్ర హీరోలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రకుల్ కి రియా కి ఈ మధ్య మంచి స్నేహ బంధం ఉందని ఇటీవల సోషల్ మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రకుల్ పేరు బయటకు రావడం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి