టాలీవుడ్ ఇండస్ట్రీలో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. మొదట సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించిన విజయ్, ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇక తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తో ఏకంగా స్టార్ హీరో క్రేజ్ ని సంపాదించి ఇప్పుడు వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారిపోయాడు. విజయ్ కి తెలుగులో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే విజయ్ తో రొమాన్స్ చేయనుంది.


ఇప్పటికే పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయం తో మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఇక విజయ్ తో తీస్తున్న మూవీ పై ఇటు ప్రేక్షకులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ పేరుతో కొంత మంది జాదూగాళ్ళు మోసాలకుపాల్పడుతున్నారు. కొంతమంది విజయ్‌ దేవరకొండ పేరు ఉపయోగించుకుని తప్పుడు ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నారని విజయ్ దేవరకొండ టీమ్ వెల్లడించింది. 'విజయ్‌ దేవరకొండతో సినిమా తీయబోతున్నామంటూ కొన్ని నిర్మాణ సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.

ఆయన సినిమాకు ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నామంటూ.. నటీనటులను సంప్రదిస్తున్నాయి.అలాంటివారిని నమ్మవద్దని విజయ్ టీమ్ కోరింది. విజయ్ సినిమాకు సంబందించిన అప్డేట్స్ ను విజయ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలుపుతాడని అదేవిధంగా విజయ్‌ నటించబోతున్న ఏ ప్రాజెక్టైనా సరే నిర్మాతలు అధికారికంగా నేరుగా ప్రకటిస్తారు.అని క్లారిటీ ఇచ్చింది విజయ్ టీమ్.ఇక తన తాజా చిత్రం ఫైటర్ కి సంబంధించిన అన్నీ వివరాలను కూడా నేరుగా విజయ్ నే తన అధికారిక సోషల్ మీడియాలో తెలియజేస్తున్నట్లు వెల్లడించారు

మరింత సమాచారం తెలుసుకోండి: