పాయల్ గోష్ మాట్లల్లో “ఒకసారి నేను ఒక డైరెక్టర్ ని కలిశా. రూమ్‌లోకి తీసుకువెళ్లి బ్లూఫిలిం చూపించాడు. హీరోయిన్లు ఎవరిని పిలిచినా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తానని చెప్పాడు. నాకు సిచ్యువేషన్ అర్థమయ్యింది. హెల్త్ బాగోలేదని చెప్పి అక్కడి నుండి తప్పించుకున్నా” అని పాయల్ ఘోష్ చెప్పింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మిగతా డైరెక్టర్లతో అటువంటి అనుభవాలు ఎదురుకాలేదని అన్నది.ఆ డైరెక్టర్ ఎవరు అనేది ఆమె చెప్పలేదు. కాని అతను ఒక ఫేమస్ బాలీవుడ్ డైరెక్టర్ అని తెలుస్తుంది. అలాగే పాయల్ గోష్ తన లవ్ ఎఫైర్ గురించి కూడా చెప్పింది. పాయల్ గోష్ ఒక క్రికెటర్‌తో డేటింగ్, బ్రేకప్ తరవాత కంప్లీట్ డిప్రెషన్‌లోకి వెళ్ళాననీ, లాంగ్ ట్రీట్మెంట్ తరవాత దాన్నుండి బయటపడ్డానని ఆమె తెలియజేసింది.ఇక సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మ హత్య గురించి ఇలా మాట్లాడింది. సుశాంత్ సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదని పాయల్ ఘోష్ అంటున్నది. అతడు ఆమెకు కొన్నేళ్లుగా తెలుసు అని చెప్పింది. చాలామంది సినిమా యాక్టర్లు డ్రగ్స్ తీసుకుంటారని, అలాగని వాళ్లందరో మత్తు పదార్థాలకు బానిసలు కాదని పాయల్ వెల్లడించింది. డ్రగ్స్ టాపిక్ వస్తే అక్కడ నుండి వాటికి దూరంగా జరుగుతానని తెలిపింది. చాలామంది సెలబ్రిటీలు తామెందుకు డ్రగ్స్ తీసుకోకూడదని ట్రై చేస్తారట. అలా అలా తరవాత వాటికి అలవాటు పడతారని వివరించింది.
ఇక సుశాంత్ సింగ్ రాజపుత్ కేసులో ఇప్పటికి పలు సంచలన నిజాలు బయటపడుతూనే వున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి