అన్ని రకాల ప్రేక్షకుల మనసుల్ని ఆకట్టుకోవడంలో ముందుంటాడు నాచురల్ స్టార్ నాని..... కంటెంట్ ఏదైనా తన నటనతో సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ తన చిత్రాలను ముందుండి నడిపించే మల్టీ టాలెంటెడ్ పర్సన్ నాని. ఇప్పుడు మరో అద్భుతమైన కథ తో మన ముందుకు రానున్నారు.
నిన్ను కోరి వంటి
బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న ఈ
హీరో మరోసారి అదే కాంబో తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు....
ప్రస్తుతం
నాని సుధీర్ బాబు నటించిన "వి"
సినిమా ఓటీటీ వేదికపై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే... ఈ చిత్రం అనుకున్నంత కాకపోయినా ఓ విధంగా ప్రేక్షకులను డిసప్పాయింట్ చేయకుండా మెప్పించిందనే చెప్పాలి. ఇంద్రగంటి మోహన
కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం
జెంటిల్మెన్ సినిమా అంత సూపర్ టాక్ సంపాదించుకోకపోయినా.... మిశ్రమ స్పందనను తెచ్చుకొని క్రేజ్ పెంచుకుంది... ఊహించిన ఫలితాలు ఈ చిత్రానికి రాకపోవడానికి కారణం థియేటర్స్ లేకపోవడం అని కొందరి అభిప్రాయం.....
అయితే ఇప్పటికే
నిన్ను కోరి దర్శకుడు
శివ నిర్వాణ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతున్నట్లు ప్రకటించిన నాని. ప్రస్తుతం ఆ పనిలో పడ్డాడు.
నిన్ను కోరి సినిమా లో దర్శకుడు
శివ నిర్వాణ తో పని చేసిన నాని...ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో సూపర్ హిట్ అందుకోవాలని ట్రై చేస్తున్నారట.... అందుకే ఈ సినిమాలో కొన్ని ఎంటర్టైన్మెంట్ సీన్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించి మరి జోడించారని తెలుస్తోంది. ఈ సినిమాపై ఇంత ఫోకస్ చేస్తున్న
నాని బ్లాక్ బాస్టర్ ను అందుకోవడానికి ప్రణాళికలు బాగానే సిద్ధం చేస్తున్నారు... ఈ చిత్రంలో
సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అన్ని షూటింగ్స్ పనులను కంప్లీట్ చేసుకొని వీలైనంత త్వరగా వచ్చే ఏడాది మొదటి నెలలో రిలీజ్ చేయాలన్నది వీరి ప్లాన్...