లాస్ట్ మూడు సీజన్ల కంటే కూడా ఈ బిగ్ బాస్ సీజన్ 4 ని చాలా రిచ్ గా మరియు సరి కొత్తగా లాంచ్ చేశారు. లాంచ్ అయినా మూడు రోజుల్లోనే చాలా బాగా పాపులర్ అయ్యింది. గొడవలు, అలకలతో ఎంతో ఉత్కంఠకు గురి చేస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 4 లో నిన్న అనగా శనివారం కరాటే కల్యాణి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.  అయితే ఆమె ఎలిమినేషన్ వెనకాల గల ముఖ్యమైన కారణాన్ని  ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో చదవండి ...


బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో రెండో ఎలిమినేషన్‌ జరిగిపోయింది. తొలి వారం లాగే రెండో వారంలో కూడా అందరూ అనుకున్న వ్యక్తే ఎలిమినేట్‌ అయిపోయారు. సూర్యకిరణ్‌కు రెప్లికా కాకపోయినా, ఆయనలా ప్రతి విషయానికి సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యే కళ్యాణిని బయటకు పంపించేశారు. రెండో వీకెండ్‌ తొలి రోజు చాలా సాదాసీదాగా కరాటే కళ్యాణిని ఎలిమినేట్‌ చేసేశాడు నాగ్‌. దాంతోపాటు మరో ఎలిమినేషన్‌ కూడా ఉందని ప్రకటించాడు కూడా.

ఇంట్లోకి వచ్చిన తొలి రోజు నుంచి కళ్యాణి అందరితో కలివిడిగా ఉంటున్నా… ఎక్కడో చిన్న దూరం కనిపించేది. కారణం ఆమె భోళాతనం. ఏ విషయంలోనైనా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసే తత్వం కళ్యాణిది. అదే ఆమె అందరికీ దూరం అవ్వడానికి కారణమైంది. కొన్నిసార్లు అనవసరంగా కోపాలు తెచ్చుకోవడం, అరవడం, ఏడవడం లాంటివి ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు.ఇంకా చెప్పాలంటే కరాటే కల్యాణికి సోషల్ మీడియాలో కాని నార్మల్ గా కాని ఫ్యాన్స్ కాని, ఫాలోవర్స్ కానిఎవరు లేరు.  అందుకే  జనాలు ఓట్లు వేయలేదు. సేమ్ సూర్య కిరణ్ కి కూడా అంతే సోషల్ మీడియా లో క్రేజ్ లేకపోవడం వలెనే ఎలిమినేట్ అయిపోయాడు. ఇక్కడ ఇద్దరు చేసిన కామన్ మిస్టేక్ ఏమిటంటే తమని తామే ఎలిమినేట్ చేసుకున్నారు. అదే వీరు చేసిన పెద్ద తప్పు. వేరే వాళ్ళు నామినేషన్ చేసిన పర్వాలేదు కాని వీరిద్దరూ తమకు తాము నామినేషన్ చేసుకొని మరి ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ఈ వారం ఎలిమినేట్‌ చేసి బయటకు పంపించేశారు. మరి ఈ రోజు స్టేజీ మీద వచ్చిన కళ్యాణి ఏం చెబుతుందో చూడాలి.


 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: