హవీష్‌ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. హీరోగా కెరీర్‌ని బెస్ట్‌ స్టేజ్‌కి తీసుకెళ్లడానికి వర్కవుట్స్‌ చేస్తూనే ప్రొడ్యూసర్‌గా సక్సెస్‌ అందుకోవడానికి స్కెచ్చులేస్తున్నాడు. హీరో కమ్ ప్రొడ్యూసర్‌గా జర్నీని పీక్స్‌కి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు హవీష్.


రవిబాబు 'నువ్విలా' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హవీష్ యాక్టింగ్‌తో పాటు ప్రొడక్షన్‌పైనా కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు. హీరోగా సూపర్‌ స్టార్డమ్ సంపాదించుకోవడానికి కథలు వింటూనే, నిర్మాతగా సినిమాలు తీయడానికి ప్రిపేర్ అవుతున్నాడు. కమర్షియల్ స్టోరీస్‌తో బీసీ సెంటర్స్‌ని టార్గెట్ చేస్తున్నాడు.


హవీష్ సొంత బ్యానర్‌లో బ్యాక్‌ టు బ్యాక్ మూవీస్ ప్రొడ్యూస్‌ చేసేందుకు కథలు రెడీ చేసుకుంటున్నాడు. రీసెంట్‌గానే 'రాక్షసుడు'సినిమాతో నిర్మాతగా సూపర్ హిట్‌ అందుకున్న హవీష్, ఈ మూవీని హిందీలో కూడా రీమేక్ చెయ్యాలనుకుంటున్నాడు. అలాగే రవితేజతో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాడు. వీటితోపాటు మరో రెండు సినిమాలని లైన్‌లో పెడుతున్నాడు హవీష్.

హీరో కమ్ ప్రొడ్యూసర్ హవీష్ చాలా బిజీ అయిపోయాడు. ఎప్పుడూ చేయని విధంగా కొత్తకొత్తగా ప్రయత్నిస్తున్నాడు. కమర్షియల్ సినిమాలకు ఓకే చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నాదు. దీంతో నాలుగు రూపాయలు వెనుకేసుకోవాలని తపన పడుతున్నాడు. అందుకే కమర్షియల్ సినిమాలకు కమిట్ అయ్యాడమే ప్రచారం ఊపందుకుంటోంది.హీరో కమ్ ప్రొడ్యూసర్ గా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే హవీష్ వరుసగా రెండు సినిమాల్లో నటించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. నటించే ఆ సినిమాల్లోనూ వైవిధ్యంగా కనపడాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా చాలా కృషి చేస్తున్నాడు హవీష్. అంతేకాదు హవీష్ ప్రొడక్షన్ లో వరుసగా సినిమాలు తీసేందుకు తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. హిందీలోనూ సినిమాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. అటు బాలీవుడ్ లోనూ తన సత్తా చాటాలనీ.. అక్కడా అభిమానులను సంపాదించుకోవాలని చూస్తున్నాడు. రాక్షసుడిని హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు మాస్ మహారాజా రవితేజతో కూడా హవీష్ ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.చూద్దాం.. ఏం జరుగుతుందో.















మరింత సమాచారం తెలుసుకోండి: