స్వీటీ అనుష్క సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తుందా..? జేజమ్మ సినిమాలిక చేయదా..? ఇలాంటి వార్తలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. భాగమతి తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న అనుష్క నిశ్శబ్ధం సినిమా చేసింది. అయితే సినిమా సినిమాకు ఆమె తీసుకునే గ్యాప్ లో సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతుంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో అనుష్క వీటికి ఫుల్ స్టాప్ పెట్టేసే ప్రయత్నం చేసింది. భాగమతి తర్వాత సినిమాలు చేయాలని అనుకోగా సరైన కథ దొరకలేదని అన్నారు అనుష్క.  

అంతేకాదు కొద్దిగా విశ్రాంతి అవసరం అనిపించే సినిమాలు చేయలేదని.. అయినా కూడా మంచి కథ దొరికితే చేద్దామని ఆలోచనలో ఉన్నానని చెప్పుకొచ్చింది అనుష్క. హేమంత్ మధుకర్ నిశ్శబ్ధం కథ బాగా నచ్చిందని.. అందుకే ఈ సినిమా కోసం చెవిటి, మూగ పాత్రలో నటించానని చెప్పారు అనుష్క. పెళ్ళి గురించి ప్రశ్న అడిగితే దానికి సమాధానం దాటేవేశారు. నిశ్శబ్ధం సినిమా ఓటిటి రిలీజ్ అవడం కూడా కొత్త అనుభూతి ఇస్తుందని అన్నారు.బాహుబలి, భాగమతి సినిమాల తర్వాత అనుష్క నటించిన నిశ్శబ్ధం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అమేజాన్ ప్రైం లో అక్టోబర్ 2న రిలీజ్ అవుతుంది.

నిశ్శబ్ధం తర్వాత నెక్స్ట్ సినిమా ఓకే చేయలేదు అనుష్క. అయితే తమిళలో మాత్రం రెండు సినిమాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గౌతం మీనన్, ఏ.ఎల్ విజయ్ ఇద్దరు అనుష్కతో సినిమా కన్ఫాం చేసినట్టు తెలుస్తుంది. మరి తెలుగులో సరైన కథలు దొరకట్లేదని చెబుతున్న అనుష్క తమిళంలో మాత్రం సినిమాలు సైన్ చేస్తుంది.                                                         

మరింత సమాచారం తెలుసుకోండి: