కొందరు హీరోయిన్స్‌ యాక్టింగ్‌తో పాటు అదర్‌ యాక్టివిటీస్‌లో టాలెంట్‌ చూపిస్తారు. అదాశర్మ నటిగా ఫ్రూవ్‌ చేసుకోకపోయినా.. ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోయినా.. సోషల్‌ మీడియాలో ఈ  అమ్మడు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. యాక్టింగ్‌లో వేరియేషన్స్‌ చూపించకపోయినా.. ఈ అమ్మడిలో చాలా కళలు దాగున్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా సోషల్‌ మీడియోలో వదులుతూ ఉంటుంది.

బుట్టబొమ్మలా కనిపిస్తున్న అదా శర్మ కర్రను యమా స్పీడ్‌గా తిప్పేసింది. ఈ వీడియోను రీసెంట్‌గా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయగా.. అందరినీ ఆకట్టుకుంటోంది. 28 ఏళ్ల అదా 12 ఏళ్ల క్రితమే.. 16 ఏళ్ల వయసులో '1920' అనే హిందీ మూవీతో తెరంగేట్రం చేసింది. హార్ట్ ఎటాక్‌తో పూరీ తెలుగులోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత సన్నాఫ్‌ సత్యమూర్తి... సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌లో సెకండ్‌ హీరోయిన్‌ నటించి సక్సెస్‌ అందుకుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ క్షణం హిట్‌ అయినా.. నాలుగు ఆఫర్స్‌ తీసుకురాలేదు.

అదాకు తెలుగులోనే కాదు.. హిందీలోనూ ఆఫర్స్‌ లేవు. ఈ అమ్మడు వెండితెరపై కనిపించకపోయినా.. గ్లామర్‌ ఫొటోలతో.. వీడియోలతో  సోషల్‌ మీడియాను హీట్‌ ఎక్కిస్తూ వుంటుంది. మధ్యమధ్యలో  విన్యాసాలతో ఔరా అనిపిస్తుంది. బిగ్‌స్క్రీన్‌పై.. ఒయ్యారాలు ఒలకబోయడం.. ఇన్నోసెంట్‌గా కనిపించడం తప్ప పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్‌ వున్న రోల్స్‌ పడలేదు. ఎర్రగా బుర్రగా న్న ఈ అమ్మడిని ఒక గ్లామర్‌ డాల్‌గానే సినిమా ఇండస్ట్రీ చూసింది. ఆఫ్‌ స్క్రీన్‌లో మాత్రం అదా టాలెంట్‌కు హద్దుల్లేవు.  కర్రసాము చేస్తుంది. గతంలో ఓసారి రోప్‌తో చేసిన విన్యాసం కూడా ఆకట్టుకుంది.

అదా యాక్టింగ్‌తో కంటే.. గ్లామర్‌తో కంటే.. ఫీట్స్‌తో ఎక్కువ ఇంప్రెస్‌ చేస్తోంది. ఈ అమ్మడి బాడీ లాంగ్వేజ్‌ చాలా ఫ్లెక్సిబుల్‌. ఎటు పడితే అటు మౌల్డ్‌ అవుతుంది. ఇవన్నీ సినిమాలో  చూపించే అవకాశం దక్కుతుందో లేదో గానీ...సోసల్‌ మీడియా వేదికగా మరో హీరోయిన్‌లో లేని విద్యను ప్రదర్శిస్తూ ఉంటుంది అదా.



మరింత సమాచారం తెలుసుకోండి: