బిగ్ బాస్ సీజన్ 4లో శని ఆదివారాల్లో ఒక హౌజ్ మేట్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌజ్ నుండి వారి సొంత ఇంటికి వెళ్తారు. అయితే నామినేషన్స్ వేసిన వారిలో ఎవరు ఆ వారం మొత్తం ఆడియెన్స్ మనసు గెలుస్తారో వారిని సేఫ్ చేయడం.. అంతగా ఆకట్టుకోని వారిని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఓటింగ్ ప్రక్రియ ద్వారా జరిపే ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో ఒక్కోసారి స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టంట్స్ కూడా ఎలిమినేట్ అవ్వొచ్చు. లాస్ట్ వీక్ బిగ్ బాస్ హౌజ్ నుండి దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యారు. హౌజ్ లో ఉన్న వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్స్ అయిన దేవి నాగవల్లి ఎలిమినేట్ అవడం షాక్ అయ్యేలా చేసింది.

ఇక మరోపక్క ఈ వారం నామినేషన్ లో ఏడుగురు హౌజ్ మేట్స్ ఉన్నారు. వారిలో ఇద్దరు మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరు ఎవరంటే సోహేల్, మెహబూబ్. ఆల్రెడీ లాస్ట్ వీక్ చివరి వరకు వచ్చిన మెహబూబ్ సేవ్ అయ్యాడు. అయితే ఈ వారం అతని పర్ఫార్మెన్స్ పెద్దగా మెప్పించలేదు. అంతేకాదు హౌజ్ లో అతను చేస్తున్న కొన్ని పనులు ఆడియెన్స్ ను అతని మీద నెగటివ్ ఇంప్యాక్ట్ ఏర్పరచుకునేలా ఉంటున్నాయి. సోహేల్ కూడా ఒక్కోసారి మంచిగా కొన్నిసార్లు గొడవకు దిగుతూ హౌజ్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాడు.

ఈ వారం ఈ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అసలైతే ఈ వారం మ్యాక్సిమం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అయితే ఒకవేళ మెహబూబ్, సోహేల్ కాకుంటే మాత్రం మళ్ళీ కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. మరి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది ఈరోజు సాయంత్రం తెలుస్తుంది. నాగ్ వస్తే ఆ హంగామా వేరేలా ఉంటుంది. శని, ఆదివారల్లో నాగార్జున ఎపిసోడ్ హైలెట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: