స్టార్స్  వెండితెర వదిలి అంత త్వరగా బుల్లి తెరమీదకు రారు. ఒక వేళ వచ్చినా డిజిటల్ దునియాలోకి అస్సలు అడుగుపెట్టరు. కానీ ట్రెండ్ మారడంతో  హేమా హేమీలంతా క్యూ కట్టి మరీ డిజిటల్ ప్రపంచంలోకి కాస్ట్ లీ అడుగులు వేసుకుంటూ వచ్చేస్తున్నారు. నిన్న డిజిటల్ కు వచ్చేది లేదూ.. అన్న వారంతా నేడు కో అంటే కోటి అంటూ కథలు పడుతున్నారు.

బాలీవుడ్ దిగ్గజాలంతా డిజిటల్ రంగంలో తన ప్రతిభ చూపించడానికి  ముందుకొస్తున్నారు. మొన్నటి వరకు ఈ ఫీల్డ్ కు రావడానికి కాస్త సిగ్గుగా ఫీల్ అయిన హీరోలు, హీరోయిన్లు ఇప్పుడు తమ మైండ్ సెట్ మార్చుకున్నారు. వెబ్ సిరీస్ లు, ఫిల్మీ సిరీస్ లు చేస్తూ ఇక్కడ కూడా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసమని సినిమాలకు మించిన పారితోషకాన్ని తీసుకుంటున్నారు. ఎంటైర్ బిటౌన్ మూమెంట్ చూస్తే ఈ విషయం  మనకు బాగా అర్ధమవుతుంది.

కిలాడి అక్షయ్ కుమార్ కుమార్  అమెజాన్ ప్రైమ్ కోసమని "ది ఎండ్ "అనే వెబ్ సిరీస్ కు కమిటయ్యాడు. ఇప్పటికే ఈ సిరీస్ లో తాను ఏ స్థాయిలో  చేస్తున్నానో అని చెప్పడానికి అనౌన్స్ మెంట్ రోజునే తన ఒంటికి మంటలు అంటించుకుని స్టేజ్ పై రిస్కీ షాట్ చేశాడు. అప్పట్లో ఈ విషయంపై వైఫ్ ట్వింకిల్ ఖన్నా చాలా సీరియస్ అయింది. అయితే ది ఎండ్ వెబ్ సిరీస్ లో అక్కీ చేస్తున్నందుకుగాను 90కోట్ల వరకు రెమ్యునిరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది.

కబీర్ సింగ్ తో బాలీవుడ్లో ఫుల్ ట్రెండ్ లోకి వచ్చిన హీరో షాహిద్ కపూర్. ఇతగాడు ఒక్కో సినిమాకు మహా అయితే 30 నుంచి 40కోట్ల లెక్క తీసుకుంటాడు.అది కూడా కాస్త ట్రెండ్ లో ఉంటేనే నిర్మాతలు ఇస్తారు. అయితే తాజాగా వచ్చిన ఇమేజ్  ను క్యాష్ చేసుకోవడానికి నెట్ ఫ్లిక్స్ ఇచ్చిన డీల్ కు ఓకే చెప్పేశాడు. దానిలో భాగంగా అతనికిచ్చే 100కోట్ల రెమ్యునిరేషన్ కు కొన్ని వెబ్ సిరీస్ లతో పాటు ప్రమోషనల్ ప్రాజెక్ట్స్ లలో నటించాల్సి ఉంటుంది. ఏ విధంగా చూసుకున్నా షాహిద్ కు ఇది మంచి డీల్ .

మరింత సమాచారం తెలుసుకోండి: