ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉన్న హీరోయిన్ ఎవరంటే అందరు చెప్పే మొదటిపేరు పూజా హెగ్దే. మొదట్లో కెరియర్ నత్తనడక నడిచినా ఎప్పుడైతే అమ్మడు టూ పీస్ బికినితో కనిపించిందో అమ్మడి రేంజ్ మారిపోయింది. టాలీవుడ్ దర్శక నిర్మాతలు పూజా హెగ్దే డేట్స్ కోసం క్యూలు కడుతున్నారు. ఆమె సినిమాలో అందానికి అందం.. గ్లామర్ డోస్ ఎక్కువైనా సరే ప్రేక్షకులకు పండుగ చేసుకోవడం ఖాయం. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న రాధే శ్యామ్ సినిమాలో నటిస్తుంది పూజా హెగ్దే.    

ఈరోజు బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ పూజా హెగ్దే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ప్రేరణ పాత్రలో నటిస్తున్న పూజా హెగ్దే ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తుంది. పోస్టర్ లోనే ఇంత అందంగా ఉంటే ఇక సినిమాలో ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక పూజా ప్రేరణ పాత్రలో డబుల్ క్రేజ్ తెచ్చుకోవడం గ్యారెంటీ అనేలా ఉంది.

పిరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్దే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అనిపిస్తుంది. ఇక ప్రేరణగా ఫస్ట్ లుక్ తో ఇంప్రెస్ చేసిన పూజా హెగ్దే ఈ సినిమాతో తన ఇమేజ్ పెంచుకోవడం ఖాయమనేలా ఉంది. రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్దే పర్ఫెక్ట్ పెయిర్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా పూజా హెగ్దే అఖిల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నట్టు తెలిసిందే. ఆ సినిమాలో కూడా పూజా తన గ్లామర్ తో అందరిని ఆకట్టుకునేలా ఉంది.                                                             

మరింత సమాచారం తెలుసుకోండి: