ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన `రోజా` చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇందులో నటించిన మధుబాలకు అంతకుమించి పేరు వచ్చింది. ఈ సినిమా తరువాత తనకు అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పుడు ఈమె ఓ సంచలన సినిమాలో నటించే అవకాశం కొట్టేసిందని వార్త హల్చల్ చేస్తోంది. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా అయితే మన ప హెరాల్డ్ ఆర్టికల్ పై ఓ లుక్కేయండి.

 అప్పట్లో సంచల హీరోయిన్  గా పేరొందిన మధుబాల ఇటీవల క్యారెక్టర్ నటిగానూ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసినదే. బాలీవుడ్ క్వీన్ కంగన నటిస్తున్న తలైవి చిత్రంలో ఎంజీ రామచంద్రన్ భార్యామణి జానకి రామచంద్రన్ పాత్రకు మధుబాల ఎంపికైంది. ఈ విషయాన్ని అధికారికంగా తనే వెల్లడించింది. నిజానికి జానకి గారిని నేను కలవలేకపోయాను కానీ.. జయలలిత గారిని కలిసే అవకాశం దక్కిందని మధుబాల వెల్లడించింది. మాజీ తమిళనాడు సిఎం జె. జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి సెట్స్ నుంచి ఫోటోలను షేర్ చేశారు. ``ఈ ప్రపంచంలో చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉండవచ్చు. కానీ చాలా ఓదార్పు ... ఇది ఒక ఫిల్మ్ సెట్`` అంటూ తాను ఆన్ లొకేషన్ లో ఉన్న విషయాన్ని మధుబాల వెల్లడించింది.

చిత్రం లో నటిస్తున్నానని తెలియగానే జానకి పాత వీడియో క్లిప్పులను చూశాను. ఆమె నటించే విధానము మరియు హావభావాలను ప్రదర్శించే తీరును నిశితంగా గమనించాను.  జానకి అమ్మ చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి . కెమెరా రోల్ అయ్యిందంటే..వెంటనే నా పాత్రలో మునిగిపోతాను. నిజ జీవితంలో ఒక వ్యక్తిని ప్రతిబింబించడానికి చాలా హార్డ్ వర్క్ అవసరం ఎందుకంటే ప్రతి వ్యక్తికి నడవడానికి.. మాట్లాడటానికి.. కూర్చోవడానికి తనకంటూ ప్రత్యేక మార్గం ఉంటుంది. ఈ చిన్న వివరాలు నేర్చుకునేందుకు పర్పక్షన్ కోసం చాలా ముఖ్యమైనవి`` అని మధు తెలియచేసింది.

గతంలో జయలలిత మరియు ఎంజీఆర్ ల శృంగారం పై ఎన్నో పుకార్లు వచ్చాయి. కాగా అతను చివరికి జానకిని వివాహం చేసుకున్నాడు. దక్షిణ చిత్ర పరిశ్రమలో తెరపై అత్యంత ప్రాచుర్యం పొందిన జంటగానూ పాపులర్. అయితే ఈ బయోపిక్ లో భాగ్యశ్రీ జయలలిత తల్లిగా.. అరవింద్ స్వామి ఎంజిఆర్ గా నటించనున్నారు. ఈ బహుభాషా బయోపిక్ 2020లో విడుదల కావలసి ఉండగా, ఇటీవల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ఇది నిరవధికంగా వాయిదా పడింది. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. మరి ఇందులో నటించే మధుబాలకు ఏ చిత్రం మంచి పేరును తీసుకువస్తుందా...

మరింత సమాచారం తెలుసుకోండి: