చిన్నప్పుడే విడిపోయిన ప్రేమికులు పెద్దయ్యాక ఎలా కలుసుకున్నారు? అందుకు దారి తీసిన పరిస్థితులేంటి? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.2001వ సంవత్సరం అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం 19 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇదిలా ఉండగా.. ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి హీరోగా ఉదయ్ కిరణ్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే తరువాత ఆ అవకాశం ఉదయ్ కిరణ్ కు దక్కిందట. ‘మనసంతా నువ్వే’ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో మరెవరో కాదు.. మన సూపర్ స్టార్ మహేష్ బాబు.
2001 టైములో యం.ఎస్.రాజు నిర్మాణంలో మహేష్ ఓ చిత్రం చెయ్యడానికి కమిట్మెంట్ ఇచ్చాడు. ఆ టైములో మన యం.ఎస్.రాజు గారు మహేష్ కు దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తో ‘మనసంతా నువ్వే’ కథను వినిపించారు. అయితే అప్పుడు మంచి కమర్షియల్ సినిమా చెయ్యాలని ఎదురుచూస్తున్న మహేష్.. ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసాడట. అలా అది ఉదయ్ కిరణ్ వద్దకు వెళ్ళింది. అటు తరువాత మహేష్- యం.ఎస్.రాజు నిర్మాణంలో ‘ఒక్కడు’ అనే బ్లాక్ బస్టర్ చిత్రం వచ్చింది. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్ డేట్స్ కొరకు ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి