దాదాపు 7 నెలలు ఈ సినిమా రిలీజ్ఆగిపోయింది. తాజాగా దీన్ని డిజిటల్ రిలీజ్ కే ఇవ్వబోతున్నట్టు ముంబై టాక్. థియేటర్లు తెరుచుకున్నాక ఇలాంటి నిర్ణయం ఏమిటా అని ఆశ్చర్యం కలగొచ్చు కానీ దానికి కారణాలు లేకపోలేదట. దీపావళి దాకా సినిమా హాళ్లకు కనీస కలెక్షన్లు వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. ఒకవేళ పండగ సమయానికి ఏవైనా కొత్త సినిమాలు విడుదల చేసినా అప్పటికి ప్రభుత్వం ఫుల్ కెపాసిటీకి పర్మిషన్లు ఇవ్వడం అనుమానమే. అలాంటప్పుడు ఇంత కాలం నిరీక్షించి ఉపయోగం ఉండదు. అందుకే కలెక్షన్ల విషయంలో కాంప్రమైజ్ ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నారట..
ఇక విరాట పర్వం విషయానికొస్తే ఈ సినిమ తో ఎలాగైనా హిట్ కొట్టాలని రానా భావిస్తున్నాడట.. నీది నాది ఒకే కథ' అంటూ తొలి చిత్రాన్నే ఒక ప్రత్యేక చిత్రంగా మలిచిన వేణు ఉడుగుల విరాట పర్వంపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.ఈ చిత్రాన్ని సురేష్ బాబు సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తుండగా సురేష్ బొబ్బిలి సంగీతమందిస్తున్నారు. 90ల నాటి కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కొన్ని పాత్రలు హైలైట్ కాబోతున్నాయని చెప్తున్నారు.హీరోయిన్ సాయి పల్లవి తో పాటు నందితా దాస్ ప్రియమణి జరీనా వహాబ్ ఈశ్వరీ రావులవి శక్తివంతమైన పాత్రలుగా ఉంటాయని తెలుస్తోంది. వారి పాత్రలు ఇందులో కీలక మైనవి అని సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి