కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నయనతార అక్కడ తన సినిమా అంటే స్టార్ హీరోలు కూడా షేక్ అయ్యే రేంజ్ తెచ్చుకుంది. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన ఈ అమ్మడు ప్రస్తుతం చేస్తున్న సినిమా నెట్రికన్. ఈ సినిమాను నయనతార లవర్ విఘ్నేష్ శివన్ నిర్మిస్తుండగా గృహం సినిమా డైరక్టర్ మిలింద్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ఈరోజు రిలీజ్ చేశారు.

ఎప్పుడు ప్రయోగాత్మక సినిమాలు చేసేందుకు రెడీగా ఉండే నయనతార ఈసారి కూడా డిఫరెంట్ స్టోరీతో నెట్రికన్ సినిమా చేస్తుంది. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై సూపర్ బజ్ ఏర్పడేలా చేసింది. ఇక ఈ పోస్టర్ పై యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్పెషల్ ట్వీట్ చేశాడు. లేడీ సూపర్ స్టార్ కు ఆల్ ది బెస్ట్ అంటూ నెట్రికన్ ఫస్ట్ లుక్ సూపర్ అంటూ అనిరుధ్ చిత్రయూనిట్ కు స్పెషల్ గ్రీటింగ్స్ అందించారు.

చూస్తుంటే ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసేలా ఉన్నారు. ఈ సినిమాతో పాటుగా విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో నయనతారసినిమా చేయనుంది. ఆ సినిమాలోం విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. సినిమాలో సమంత కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తుందని తెలుస్తుంది. త్వరలోనే ఆ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. ప్రస్తుతం నయనతార నెట్రికన్ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచుతుంది.                                                                  



మరింత సమాచారం తెలుసుకోండి: