మెగా ప్రిన్సెస్ నిహారిక కొత్త ఫోటో షూట్ లతో అదరగొడుతోంది.... కొత్త పెళ్ళికూతురు అందం కొట్టొచ్చేలా ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది...నాగబాబు కుమార్తె... వరుణ్ తేజ్ సోదరి నిహారిక కొణిదెల వివాహం త్వరలో జరగనుందనే విషయం విధితమే. గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి త్వరలోనే అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే ఇటీవలే నిహారిక - చైతన్యల నిశ్చితార్థం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఆర్భాటంగా జరగగా,ఈ ఏడాది చివర్లో మెగా కాంపౌండ్ లో పెళ్లి భాజాలు మోగనున్నాయని సమాచారం. మరికొన్ని రోజుల్లో పెళ్లి కూతురు కాబోతున్న  హీరోయిన్ నిహారిక తాజాగా మేగజైన్ కవర్ పేజీ కోసం ఫోటో షూట్ నిర్వహించింది.

పుత్తడి బొమ్మ నిహారిక ఈ ఫోటోలలో మరింత అందంగా కనిపించింది. ఎథిక్ దుస్తుల్లో ఉన్న నిహారికకు ఆమె ధరించిన నగలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గతంలో ఫోటోషూట్ కోసం మోడ్రన్ అవుట్ ఫిట్స్ తో అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించిన నిహారిక.. ఇప్పుడు మేగజైన్ కవర్ పేజీ కోసం వధువుగా ముస్తాబై ఫోటోషూట్ లో ఎంతో అద్భుతంగా కనిపించింది. కాగా నిహారిక కొన్ని రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి గోవాలో బ్యాచిలరేట్ పార్టీ చేసుకున్నారు.

ఇక  ఈ మెగా ప్రిన్సెస్ వివాహం తర్వాత కూడా కెమెరా ముందుకు వచ్చి వెండితెరపై కనిపిస్తుందా... లేదా అన్న విషయం ఇంకా సస్పెన్స్ గానే కొనసాగుతోంది. ఇక నాగబాబు నిహారిక - చైతన్యల పెళ్లి గురించి ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ డిసెంబర్ నెలలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని.. వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించిన అన్ని పనులను దగ్గరుండి మరీ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాడని తెలియజేశాడు.... మరి ఎంతైనా పెళ్లి కూతురు అన్న ఆ మాత్రం సందడి మరియు బాధ్యత ఉంటుంది అంటున్నారు ఆయన అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: