ఈ సారి దసరాకు టాప్ హీరోల టీజర్లు, ట్రైలర్లతో మార్కెట్ కలర్ పుల్ గా కనిపిస్తుందనుకున్నారు. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లు తమ అప్ డేట్ లతో అభిమానులను అలరిస్తాయనుకున్నారు. కానీ ఏం చేస్తాం.. చాలామంది ఫస్ట్ లుక్ లతోనే సినీ లవర్స్ ను శాటిస్ ఫై చేయాలని చూశారు. ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ అప్ కమింగ్ ఫిలింగా నిలిచిన కేజీఎఫ్ 2 టీజర్ విషయంలో కూడా ఇదే డిజప్పాయింట్ చూపించారు. దసరాను ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకునే "కన్నడిగులు" అయితే వియ్ నీడ్ కేజిఎఫ్ 2 టీజర్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.
ఈ సారి దసరాకు సాలిడ్ సినిమా లేకపోయినా ఆర్.ఆర్.ఆర్ రూపంలో మాంచి టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భీం టీజర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. చరణ్ వాయిస్ తో వచ్చిన ఈ టీజర్ అటు వ్యూస్ ,ఇటు లైక్స్ తో సెన్సేషన్ సృష్టిస్తుంది. పాత రికార్డులను బ్రేక్ చేస్తుంది.
అలాగే దసరా గిఫ్ట్ గా వచ్చిన రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ టీజర్.. సినిమాపై క్యూరియాసిటీ మరింతగా పెంచుతుంది. గత సంవత్సరం నుంచి ఊరిస్తున్న ఈ టీజర్.. దసరా కానుకగా వచ్చి ఎంటర్ టైన్ మెంట్ లవర్స్ కు మాంచి దసరా ట్రీట్ ఇచ్చింది. ఈ దసరాకు టాలీవుడ్ ప్రేక్షకులకు సినిమాలను ఇవ్వకపోయినా బీం టీజర్, రాధేశ్యామ్ టీజర్లతో మాంచి ట్రీట్ ఇవ్వడం చెప్పుకోవల్సిన విషయమే.
ప్రతి ఏడాది దసరా వచ్చిందంటే ఫిలిం ఫెస్ట్ వచ్చినట్లే లెక్క.కాని కరోనా ఎఫెక్ట్ అన్ని పండగలకు తాకినట్లే.. చివరకు ఈ దసరాను తాకింది. ఈ ఎఫెక్ట్ ఇప్పట్లో పరిశ్రమను వదలదనే విషయం కూడా అర్ధమైపోయింది.సో సినీ లవర్స్ అందరూ ఇంకో మూడు వారాలలో వచ్చే అటు దీపావళి పైన ఆశలు పెట్టుకోవడం మానేసి.. డైరెక్ట్ గా సంక్రాంతికి డేట్ లాక్ చేసుకోవడం బెటర్ .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి