ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...బాలీవుడ్లో డ్రగ్స్ కేసులు ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శాండల్ వుడ్ లో కూడా పెద్ద రచ్చ జరిగింది. మొన్ననే ప్రముఖ హీరో వివేక్ ఒబెరాయ్ ఇంట్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించడం ఆ తరువాత అతని భార్యకు నోటీసులు పంపడం కూడా జరిగింది. ఇప్పుడు మరోసారి ఆ రచ్చ మొదలైంది.వివరాల్లోకి వెళితే.. ప్రముఖ టీవి నటి ప్రీతికా చౌహాన్ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ ఎన్.సి.బికి(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) చిక్కిందట. ముందుగా సమాచారం అందడంతో ముంబైలోని వెర్సోవా ప్రాంతానికి మఫ్టీలో వెళ్ళారట అధికారులు.

ఆ సమయానికి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ప్రీతికాను చూడడంతో వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ రాకెట్ కు సంబంధించి మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.త్వరలోనే వీరిని ముంబైలోని కిల్లా కోర్టుకు హాజరుపరుస్తారని అక్కడి మీడియా వర్గాల సమాచారం. ‘సావధాన్’,’దేవో కే దేవ్ మహారాజ్’ వంటి ఫేమస్ సీరియల్స్ లో ప్రీతికా నటించింది. ప్రస్తుతం ఈ విషయం పై అక్కడ పెద్ద చర్చలు మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: