నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా టైటిల్ పై క్లారిటీ రాలేదు. సిం హా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ అవగా ముచ్చటగా మూడవ సినిమాగా వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే బోయపాటి, బాలయ్య బాబు సినిమాపై నందమూరి ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. ఈ సినిమా టైటిల్ ఏంటన్నది ఇంకా రివీల్ చేయలేదు. దసరాకి టైటిల్ ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని అనుకోగా అది కూడా రాలేదు.

ఓ పక్క ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నా బోయపాటి శ్రీను మాత్రం ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. సినిమాలో బాలయ్య బాబు డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. అంతేకాదు మెయిన్ విలన్ గా నవీన్ చంద్ర నటిస్తున్నాడని టాక్. మళయాళ భామ ప్రగ్యా మార్టిన్ ఈ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. సినిమాలో బాలయ్య బాబు ఒక పాత్రలో అఘోరాగా కనిపిస్తాడని తెలుస్తుంది.

బోయపాటి సినిమాలో హీరోలకు మంచి ఎలివేషన్ ఉంటుంది.. ఇక బాలయ్య బాబుతో అయితే ఆ సీన్స్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తాడు. అయితే ఈ సినిమాకు ఎప్పుడు లేని విధంగా టైటిల్, టీజర్ విషయంలో లేట్ చేస్తున్నారు. ఓ పక్క ఫ్యాన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉన్నా సరే ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం కొద్దిగా నిరాశకలిగిస్తుంది. మరి బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబో సినిమా అప్డేట్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి. దసరా మిస్సయింది దీపావళికి అయినా ఈ సినిమా టైటిల్ ఏంటన్నది చెబుతారో లేదో చూడాలి. ఈ దసరాకి నందమూరి ఫ్యాన్స్ కు నర్తనశాల గిఫ్ట్ గా ఇచ్చాడు బాలయ్య బాబు.                          

మరింత సమాచారం తెలుసుకోండి: