ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన రామ్ తన నెక్స్ట్ సినిమా రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా పడుతూ వచ్చినా ఈ సినిమా ఓటిటి రిలీజ్ ఆఫర్స్ వచ్చినా సరే కాదని చెప్పారు. ఫైనల్ గా రెడ్ థియేట్రికల్ రిలీజ్ రెడీ అయ్యింది. రెడ్ థియేట్రికల్ బిజినెస్ ఎంత అన్నది ఇంకా తెలియలేదు కాని లేటెస్ట్ గా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కు మాత్రం డీల్ సెట్ అయినట్టు తెలుస్తుంది.

రెడ్ సినిమా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తడం రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్స్ కలిసి 14 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. రామ్ కెరియర్ లో ఇది హయ్యెస్ట్ బిజినెస్ అని చెప్పొచ్చు. ఇస్మార్ట్ శంకర్ తో ఫాంలోకి వచ్చిన రామ్ ఈ సినిమాతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. రెడ్ బిజినెస్ విషయంలో సూపర్ అనిపిస్తుంది.

రెడ్ తర్వాత రామ్ మళ్లీ పూరీ జగన్నాధ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. అంతేకాదు మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరక్షన్ లో రామ్ మూవీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. రెడ్ హిట్టైతే మాత్రం రామ్ వరుస క్రేజీ ప్రజెక్టులు చేసే ప్లానింగ్ లో ఉన్నాడని చెప్పొచ్చు. కిశోర్ తిరుమలతో రామ్ నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి సినిమాలు చేశాడు. హ్యాట్రిక్ మూవీగ రెడ్ వస్తుంది. రెడ్ విషయం లో రామ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది. తప్పకుండా రామ్ మరోసారి ఈ సినిమాతో తన స్టామినా ఏంటో చూపిస్తాడని అంటున్నారు.                                          

మరింత సమాచారం తెలుసుకోండి: