బిగ్ బాస్ సీజన్ 4 లో వారం వారం గేం ఫార్ములా పూర్తిగా మారిపోతుంది. ఎవరి వారు తమ ఆటని నిరూపించుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అయితే హౌజ్ లో రెండు మూడు బ్యాచ్ లు ఉన్నాయన్న విషయం తెలిసిందే. అఖిల్, మోనాల్, సోహెల్, మెహబూబ్ ఒక బ్యాచ్ కాగా.. అభిజిత్, లాస్య, నోయెల్, హారికలది మరో బ్యాచ్ గా ఉంది. ఇక అవినాష్, అరియానా ఇద్దరు సెపరేట్ గా ఉంటున్నారు. అమ్మా రాజశేఖర్ దివి వెళ్లాక ఒంటరివాడు అయ్యాడు. ఇలా ఎవరికి వారు తమకు క్లోజ్ గా ఉన్న వారితో కలిసి ఆట ఆడుతున్నారు.

ఇదిలాఉంటే గత వారం హౌజ్ లో ఓ ఇద్దరి హౌజ్ మేట్స్ ఫార్ములా మారిపోయింది. అభిజిత్, అఖిల్ ల మధ్య ఉన్న గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఇద్దరు మాట్లాడుకోవడం జరుగుతుంది. మోనాల్ విషయంలో అభిజిత్, అఖిల్ ల మధ్య దూరం పెరిగింది. ఈ ఇద్దరు ప్రస్తుతం మాట్లాడుతుండగా శుక్రవారం ఎపిసోడ్ లో 55 రోజుల జర్నీ చూపించి మోనాల్, అభిజిత్, అఖిల్ లను ఒకటి చేశాడు బిగ్ బాస్. చూస్తుంటే ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఉందనిపిస్తుంది.

అభిజిత్ దగ్గరవడం వల్ల అఖిల్ సోహెల్, మెహబూబ్ లకు దూరమవుతున్నాడని తెలుస్తుంది. శుక్రవారం ఇద్దరిద్దరికి ఇచ్చిన ట్యాగుల్లో అఖిల్, మోనాల్ కలిసి సోహెల్, మెహబూబ్ లకు అబద్ధాల కోరుల జంట అని ఇవ్వడంతో సోహెల్ దానికి చాలా ఫీల్ అయ్యాడు. అయితే మళ్లీ కలిసి అఖిల్, సోహెల్ మాట్లాడుకున్నారు. ఫైనల్ గా అభిజిత్ అఖిల్ కు దగ్గరవడం వల్ల ఆట మారిపోయిందని మాత్రం అర్ధమవుతుంది.                                            
 

మరింత సమాచారం తెలుసుకోండి: