ఇక లేటెస్ట్ గా సుధీర్ బాబు పలాస డైరక్టర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాకు శ్రీదేవి సోడా సెంటర్ అని టైటిల్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాలో లైటింగ్ సూరి బాబుగా సుధీర్ నటిస్తున్నాడు. కెరియర్ లో ఫస్ట్ టైం సుధీర్ మాస్ రోల్ చేస్తున్నాడని అనిపిస్తుంది. పలాస డైరక్టర్ కరుణ కుమార్ మరోసారి ఈ సినిమాను కూడా పిరియాడికల్ మూవీగా ప్లాన్ చేస్తున్నాడు.
శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో సుధీర్ బాబు పాత్ర రంగస్థలం లో రాం చరణ్ పాత్రలా ఉంటుందని అంటున్నారు. చిట్టిబాబు తరహాలోనే ఈ లైటింగ్ సూరి బాబు పాత్ర ఉంటుందని అంటున్నారు. చూస్తుంటే సుధీర్ బాబుకి కరెక్ట్ టైం లో కరెక్ట్ సినిమా పడ్డదని అనిపిస్తుంది. మరి శ్రీదేవి సోడా సెంటర్ దగ్గర లైటింగ్ సూరి బాబు ఏం చేస్తాడన్నది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి