మజిలీ, ఓ బేబీ వంటి సినిమాలు సామ్ పేరును మరింతగా పెంచాయి.. ఇకపోతే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లలో ఇంట్లో వాళ్ళతో బిజీగా గడుపుతోంది.. అంతేకాదు కొత్త వంటలను తయారు చేస్తుంది.. రసాయనిక ఎరువులు వాడకం లేకుండా కూరగాయలను పెంచడం ఎలా అనే అంశాలను నేర్చుకొని అందరికీ తెలిపింది. సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు తన విషయాలను అభిమానులతో పంచుకుంటూ బిజీగా ఉంది..
అయితే సామ్ కు ఒక తమాషా ప్రశ్న ఎదురైంది..తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను పోస్ట్ చేసిన చేసిన సమంత ఫీలింగ్ గుడ్ అంటూ కామెంట్ పెట్టింది. దీనికి నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ అడిగిన తమాషా ప్రశ్నకు సమాధానం కూడా చిలిపి గా ఇచ్చింది సామ్.. అదేంటంటే నువ్వు చైతన్య ను వదిలేయ్ ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ కామెంట్ చేశాడు ఓ నెటిజన్.. ఈ విషయానికి తాజాగా స్పందించిన సామ్ కష్టం... ఒక పని చెయ్..చై ని అడుగు’ అంటూ కౌంటర్ చేసింది. సమంత సమాధానానికి ఫిదా అయిపోయిన నెటిజన్లు ఎంతైనా సామ్ గ్రేట్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి