ప్రస్తుతం జ్యోతిగా పలు సినిమాల్లో కీలక పాత్రలలో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇక సూర్య ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఇద్దరి జంట ఎప్పుడెప్పుడు కలిసి నటించ పోతారా అని కోలీవుడ్ అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కలిసి నటించాలని అభిమానులు గట్టిగా కోరుకున్నట్టున్నారు... ఎందుకంటే త్వరలో కోలీవుడ్లో ఆదర్శ దంపతులుగా ఉన్న సూర్య జ్యోతిక కలిసి నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఓ సినిమాలో సూర్య జ్యోతిక జంటగా త్వరలో నటించబోతున్నట్లు తెలుస్తోంది అభిమానులందరికీ గొప్ప శుభవార్త అనే చెప్పాలి. గతంలో వరుసగా ఏడు సినిమాల్లో నటించిన ఈ జంట మంచి బ్లాక్బస్టర్ విజయాలను తమ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ప్రేమ చిగురించి ఏడు అడుగులతో ఒకటయింది ఈ జంట. దాదాపుగా ఇద్దరు కలిసి నటించి 14 ఏళ్లు గడుస్తున్నాయి. కాగా మలయాళ దర్శకురాలు అంజలి మీనన్ దర్శకత్వంలో రాబోతున్న ఓ సినిమాలో జ్యోతిక సూర్య కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ దశ పూర్తి అవుతుందట త్వరలో అన్ని పనులు పూర్తి చేసి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అభిమానులు అందరూ ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి