ఇందులో భాగంగానే సినిమాలో కొన్ని సీన్స్ రీ షూట్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రవితేజ క్రాక్ రీ షూట్ అనగానే ఫ్యాన్స్ గుండెల్లో గుబులు మొదలైంది. గోపిచంద్ ఈ సినిమాను ఏం చేస్తాడో అన్న టెన్షన్ వారికి మొదలైంది. ఈ ఇయర్ మొదట్లో డిస్కో రాజా అంటూ వచ్చిన రవితేజ ఆ సినిమాతో కూడా అంచనాలను అందుకోలేదు. అందుకే రవితేజ క్రాక్ తో ఎలాగైనా హిట్టు కొట్టాలని ఫిక్స్ అయ్యాడు.
ఈ సినిమా తర్వాత రవితేజ రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ఎన్నో అంచనాలతో వస్తుంది. ఇదే కాదు ఈ సినిమా తర్వాత రవితేజ మారుతి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలతో రవితేజ మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నారు. క్రాక్ సినిమాలో శృతి హాసన్ తో రొమాన్స్ చేస్తున్న రవితేజ ఖిలాడిలో మాత్రం డింపుల్ హయతి, మీనాక్షి చౌదరితో జత కడుతున్నారు. ఖిలాడి సినిమాలో అనసూయ కూడా స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్. సో రవితేజ మాత్రం పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే ఈసారి హిట్ టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి