టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ల కాంబినేషన్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీళ్లిద్దరిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. గతంలో వీరి కాంబోలో వచ్చిన సింహా, లెజండ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. అందుకే అభిమానులు ఈ కాంబినేషన్ లో ముందు ముందు చాలా సినిమాలు రావాలని కోరుకుంటారు. ఇప్పుడు వీళ్లిద్దరూ ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేస్తున్నారు.ఇక బాలయ్య, బోయపాటి కాంబోలో BB3 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవల లాక్ డౌన్ కు ముందు రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. కోర మీసాలతో, పంచకట్టులో బలయ్య టీజర్ లో చెప్పిన డైలాగ్.. నందమూరి అభిమానుల్లో ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలను రెట్టింపు చేసింది.

ఇక కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడగా.. ప్రస్తుతం ప్రభుత్వం కొన్ని సడలింపులతో అనుమతులు ఇవ్వడంతో తాజాగా షూటింగ్‌ను పున: ప్రారంభించింది.ఇక ఈ సినిమా లో నటించే హీరోయిన్లు వీళ్ళే అని ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి .ఇక రెండు రోజుల క్రితం ఈ సినిమాలో బాలయ్య కు జోడిగా మలయాళ భామ ప్రయాగ మార్టిన్ దాదాపు ఖరారైందని వార్తలు వచ్చాయి. మళ్ళీ ఏమైందో ఏమో.. ఈ అమ్మడని కాస్త ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించారు.అయితే బోయపాటి ఈమెను ఎందుకు తప్పించాడో అనే సందేహం మాత్రం అభిమానుల్లో ఇప్పటికీ అలానే ఉంది. అయితే  బాలకృష్ణ సరసన సెట్ అవ్వడం లేదనే కారణంతో బోయపాటి ప్రయాగమార్టిన్ ను పక్కకు పెట్టాడని వార్తలు వచ్చాయి.

 అయితే ప్రయాగ మార్టిన్ ను ప్రాజెక్టులోకి తీసుకున్నట్టే తీసుకొని..మళ్లీ వెనక్కి నెట్టడానికి కారణం వేరే ఉందట.ఓ ఇంటర్వ్యూలో నిర్మాత మిర్యాల రవిందర్ రెడ్డి మాట్లాడుతూ..మలయాళం సినిమాకు ఇచ్చిన డేట్స్ వల్ల ప్రయాగ వెంటనే సినిమా షూటింగ్ లో చేరే అవకాశం లేదు. ప్రయాగ డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు చెప్పారు.ఇక ఆ హీరోయిన్ స్తానంలో బీబీ3 మేకర్స్ సయేషా సెహగల్ ను ఎంపిక చేశారు. పూర్ణ మరో హీరోయిన్ గా నటిస్తోంది. .ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: