ఇండియా హెరాల్డ్ అందిస్తున్న  ఈ ఆర్టికల్ చదవండి.  తెలుగులో ఇప్పుడు  ప్రతిభ కలిగిన  యువ దర్శకుల్లో  అనిల్ రావి పూడి ఒకరు. రాజమౌళి తరువాత ఫ్లోప్స్ ఎదుర్కొలేని దర్శకుడు. పటాస్, రాజా ది గ్రేట్, సుప్రీమ్‌, ఎఫ్2 వంటి హిట్ సినిమాలు తీసి మంచి హిట్లు అందుకున్నాడు.  ఎఫ్ 2 కి ఇంప్రెస్ అయ్యి అనిల్ కి  సూపర్ స్టార్  మహేష్‌బాబు పిలిచి ఛాన్స్ ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ‘సరిలేరు నీకెవ్వరూ’ అంటూ బ్లాక్‌బస్టర్ హిట్‌ ఇచ్చారు. ఇప్పుడు మరో హిట్ కొట్టి డబుల్ హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అనిల్..‘ఎఫ్3’కి రెడీ చేశాడు. అయితే ఆ ప్రాజెక్ట్ ఆలస్యం కానుండటంతో ఆయన మరో క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది.

కింగ్ నాగార్జున, అఖిల్‌తో కలిసి ఓ సినిమా చేసేందుకు అనిల్ రావిపూడి సన్నాహాలు చేస్తున్నాడట, దీనికోసం ఇప్పటికే కథ థీమ్ రెడీ చేసినట్లు సమాచారం. దీనికోసం నాగార్జునను కలిసి కథ వినిపించాడని, వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు ఫిల్మ్‌నగర్లో టాక్ వినిపిస్తోంది. అక్కినేని వారి మూడు తరాల నటులతో విక్రమ్ కె.కుమార్ తెరకెక్కించిన ‘మనం’ సినిమా అందరినీ అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగార్జున-అఖిల్ కలిసి నటించనున్నారన్న వార్త టాలీవుడ్‌లో ఆసక్తి రేపుతోంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి: