ఈ క్రమంలోనే గతంలో ప్రభుదేవా రెండో వివాహం చేసుకోబోతున్నారు అనే టాక్ వినిపించింది. ఇక కొన్ని రోజుల వరకు టాక్ వినిపించినప్పటికీ ఆ తర్వాత కాస్త మనస్పర్ధలు రావడంతో అది కుదరలేదు కానీ ప్రస్తుతం మరోసారి ప్రభుదేవా ప్రేమలో పడ్డారా.? త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడా.? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇప్పటికే ప్రభుదేవా, భార్య రామలత మధ్య మనస్పర్థలు తలెత్తి వేరుగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపిన నయనతార పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు.
ఇక ఇటీవలే ప్రభుదేవా తన బంధువు తో ప్రేమలో పడ్డట్లు ప్రస్తుతం కోలీవుడ్ కోడై కూస్తోంది. అంతేకాకుండా ఆమె ప్రభుదేవా ప్రేమను ఎంతో అర్థం చేసుకుందని దీంతో తన బంధువు అయిన మహిళను పెళ్లి చేసుకోవడానికి ప్రభుదేవా సిద్ధం అవుతున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు ఈ పెళ్లి వార్తలపై ప్రభుత్వం మాత్రం అధికారికంగా స్పందించలేదు ప్రభుదేవా. గత ఏడాది దబాంగ్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రభుదేవా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా రాధే అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి