అభిజిత్, అరియానాలకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే వారిద్దరికి ఎలాంటి సమస్య లేదు. ఇక సోహెల్ కూడా గేం బాగా ఆడుతున్నాడు కాబట్టి అతను సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎటొచ్చి మోనాల్, హారిక, లాస్యలలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అయితే వీరిలో హారిక, మోనాల్ ఏమో కాని టాప్ యాంకర్ గా లాస్య డేంజర్ జోన్ లోకి రావడం మాత్రం ఆమె ఫ్యాన్స్ ను కంగారు పడేలా చేస్తుంది. టాప్ యాంకర్ గా లాస్య మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే బిగ్ బాస్ లో ఆమె అన్ ఫిట్ అంటున్నారు.
టాస్కుల్లో కూడా లాస్య పెద్దగా ప్రభావం చూపట్లేదు. ఇప్పటివరకు లాస్య తనకు ఇంతకుముందు ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ తో నెట్టుకొచ్చింది. కాని ఇక మీదట అలా కుదరదు. కాబట్టి లాస్య ఈ వారం బయటకు వచ్చినా రావొచ్చని అంటున్నారు. మరి మోనాల్, లాస్యలలో ఎవరు ఈ వారం బయటకు వస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి