సినిమాలో పవన్ సరసన మళయాళ భామ మమతా మోహన్ దాస్ ని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. తెలుగులో కూడా మమతా మోహన్ దాస్ కు మంచి క్రేజ్ ఉంది. సింగర్ గానే కాదు తెలుగులో ఒకటి రెండు సినిమాల్లో నటించిన మమతా మోహన్ దాస్ ఆ తర్వాత మళయాళంలోనే సినిమాలు చేసింది. మధ్యలో క్యాన్సర్ వల్ల కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న అమ్మడు ఫైనల్ గా దాన్ని జయించి వరుస సినిమాలు చేస్తుంది.
ఇక లేటెస్ట్ గా పవర్ స్టార్ సినిమాలో అమ్మడికి ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. సినిమాలో పవన్ కు జోడీగా ఆమె నటిస్తుందని టాక్. ఏకే రీమేక్ లో పవన్ తో గోపీ చంద్ నటిస్తాడని అంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు పవర్ స్టార్ కేవలం 25 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చాడట. సింగిల్ షెడ్యూల్ లోనే సినిమా పూర్తి చేయాలని చెప్పినట్టు టాక్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి