స్కిట్ చేస్తున్న టైం లో వచ్చి చెయిర్ వేయడంతో రాంగ్ టైం అని తెలిసి ఆ డైరక్షన్ టీం వ్యక్తి మీద బాగా సీరియస్ అయ్యాడు అభి. ఇలా స్కిట్ మధ్యలో వస్తే టైమింగ్ మిస్ అవుతుందని చెప్పాడు. జడ్జులు కూడా అభి అంతగా సీరియస్ అవడం చూసి షాక్ అయ్యారు. అయితే అంతా సీరియస్ గా ఉన్న టైం లో అభి ఒక్కసారి నవ్వేసి ఇదిరా ప్రాంక్ అంటే అని చెప్పాడు. అభి చేసిన ఈ ప్రాంక్ బాగున్నా జబర్దస్త్ పై ఈ సీరియస్ డ్రామా ఏంటా అని ఆడియెన్స్ కూడా షాక్ అయ్యారు.
మొత్తానికి అదిరే అభి ప్రాంక్ స్కిట్ తో సూపర్ హిట్ కొట్టాడు. ఓ పక్క ఇదే ఎపిసోడ్ లో కాజల్ పెళ్లి చేసుకుందని లవ్ ఫెయిల్యూర్ గా విరహ వేదనతో ప్రియతమా నా హృదయమా అంటూ పాటేసుకున్నాడు హైపర్ ఆది. మొత్తానికి గురువారం ఎపిసోడ్ మొత్తం గురు శిష్యులు అదరగొట్టారని చెప్పొచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి