ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...బిగ్ బాస్ సీజన్ 4 చాలా బాగా ఆకట్టుకుంటుంది. అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. మొదట్లో చాలా బోరింగ్ గా అనిపించిన ఈ సీజన్ తరువాత చాలా బాగా పుంజుకుంది. ఇక బిగ్ బాస్ ప్రేక్షకులకు బిగ్ బాస్ నుంచి తాజాగా అప్ డేట్ వచ్చింది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 9.30 నిమిషాలకు,  శని-ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 4 ప్రసార సమయాల్లో మార్పులు వచ్చాయి. స్టార్ మా ఛానల్‌లో రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతున్న ‘వదినమ్మ’ సీరియల్ కోసం బిగ్ బాస్ టైమింగ్ మార్చబోతున్నారని సమాచారం అందుతుంది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఈ నెల  7 నుంచి బిగ్ బాస్ షో సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 10 గంటలకు ప్రసారం కానుంది. 10 నుంచి 11 వరకూ బిగ్ బాస్ షో ప్రసారం కానుంది. అంటే బిగ్ బాస్ షో టైంలో వదినమ్మ సీరియల్ రాత్రి 9.30 గంటలకు ప్రసారం కాబోతుంది. వదినమ్మ సీరియల్ పూర్తైన తరువాత బిగ్ బాస్ ప్రసారం కానుంది.అయితే ఎందుకంటే ఇక రాత్రి 7 గంటలకు వదినమ్మ సీరియల్ టైంలో ‘గుప్పెడంత మనసు’ అనే కొత్త సీరియల్ ప్రసారం కాబోతుంది. ఇక శని-ఆదివారానికి సంబంధించి బిగ్ బాస్ ప్రసారాల్లో ఎలాంటి మార్పులు ఉండబోవు. యాదావిదిగా రాత్రి 9 గంటలకు బిగ్ బాస్ షో ప్రసారం కానుంది. డిసెంబర్ 20న  ఈ సీజన్‌ ముగిసిపోతుంది.


చివరి వారాలే కావడంతో.. ఈ సీజన్ని చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. వ్యూవర్ షిప్‌లో పెద్దగా మార్పు లేకపోవచ్చనే ఉద్దేశంతో బిగ్ బాస్ టైంలో మార్పులు చేస్తున్నారు నిర్వాహకులు. అంతేకాకుండా ఈ మధ్య కార్తీకదీపం సీరియల్‌ కంటే  కూడా  వదినమ్మ సీరియల్ పుంజుకుంది. ఇలాంటి సీరియల్‌ని ఆ  టైంలో వేస్తే రేటింగ్ మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. బిగ్ బాస్ ఎలాగూ మరో మూడు వారాల్లో ముగుస్తుంది కాబట్టి వదినమ్మ టైమింగ్‌లో మార్పులు చేస్తున్నారు.నిజానికి వదినమ్మ సీరియల్ మొదట్లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారం అయ్యేది. అయితే ఈ సీరియల్‌ బాగా హిట్ అవ్వడంతో  చాలామంది సీరియల్ ప్రియులు టైమింగ్ మార్చాలని కోరడంతో రాత్రి 7 గంటలకు మార్చింది స్టార్ మా. ఇప్పుడు స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్స్‌లో కార్తీకదీపం సీరియల్ కి పోటీగా  ఎక్కువ రేటింగ్ సాధిస్తోంది ‘వదినమ్మ’ సీరియల్.ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: