బిగ్ బాస్ 4లో లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయినా కూడా తన దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ వల్లే హౌజ్ లో ఉండగలిగాడు అవినాష్. హౌజ్ లో తను ఎంటర్ అయిన తర్వాత నుండి కామెడీతో అలరించిన అవినాష్ ఈమధ్య ఎందుకో ప్రతి విషయానికి చాలా సీరియస్ అవుతున్నాడు. అంతేకాదు ఫ్రస్ట్రేషన్ పెరిగినట్టు అతని ఫేస్ లో కబడుతుంది. బిగ్ బాస్ సీజన్ 4లో టాప్ 5లో ఉండాలని అనుకుంటున్న అవినాష్ తన బిహేవియర్ తో అందరికి షాక్ ఇస్తున్నాడు.

టికెట్ టు ఫినాలే టాస్క్ లో మొదటి లెవల్ లోనే ఆట నుండి బయటకు వచ్చాడు అవినాష్. అందరు తనని టార్గెట్ చేశారని అంటూ ఫైర్ అయ్యాడు అవినాష్. ఇక బుధవారం ఎపిసోడ్ లో వంట పాత్రలు కడగలేదని అరియానా అవినాష్ ను సరదాగా రెస్పాన్సిబిలిటీ లేదని అన్నది. దానికి అవినాష్ పెద్ద సీన్ చేశాడు. ఈ వారం తాను నామినేషన్స్ లో ఉన్నానని నువ్వలా చెబితే ఎలా అని అరియానా మీద ఫైర్ అయ్యాడు.

అరియానా కూడా తను చెప్పింది ఒకలా అని సీరియస్ గా మాట్లాడి ఏడ్చేసింది. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె దగ్గరకు వెళ్లి సారీ చెప్పాడు అవినాష్. అయితే ఈ ఎపిసోడ్ చూస్తే అవినాష్ ఫ్రస్ట్రేషన్ లెవల్స్ ఎంత పీక్స్ లో ఉన్నాయన్నది అర్ధమవుతుంది. టికెట్ టు ఫినాలే రేసులో తనని ఆడనివ్వలేదని హౌజ్ మేట్స్ మీద ముఖ్యంగా సోహెల్, అఖిల్ మీద కోపంగా ఉన్నాడు అవినాష్.                                                                     

మరింత సమాచారం తెలుసుకోండి: