బిగ్ బాస్ సీజన్ 4 లో అభిజిత్, అఖిల్, మోనాల్ ల ట్రాక్ అసలు ఏమాత్రం అర్ధం కాదు. మోనాల్ ముందు ఇద్దరితో క్లోజ్ గా ఉంది. ఆ తర్వాత అభిజిత్ ను దూరం పెట్టి అఖిల్ కు దగ్గరైంది. అయితే ఈమధ్య మళ్లీ అభిజిత్ తో కూడా మాట్లాడుతుంది. మోనాల్ మనసులో ఉన్న ఏ అనే పేరు గల వ్యక్తి ఎవరు అంటే అఖిల్ అనే అందరు అనుకుంటారు. కాని అభిజిత్ వర్షన్ మాత్రం ఆమె మనసులో ఉన్న ఏ తనే అని అంటున్నాడు.

మోనాల్ తనకు అలా చెప్పిందని.. తనంటే ఇష్టమని చెప్పిందని అన్నాడు అభిజిత్. ఇదే హారికతో గొడవకు దారి తీస్తుంది. ఆ మనిషి అంటూ మోనాల్ గురించి ప్రస్థావిస్తున్న అభిజిత్ ఆమె మీద ఉన్న తనకు ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఆమె తనని దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. నిజంగా చెప్పాలంటే మోనాల్ తో పులిహోర కలిపాడు కాబట్టే అఖిల్ ఇన్నాళ్లు రేసులో వెనకపడ్డాడు.

అయితే అభిజిత్ ఇంకా మోనాల్ పాట పాడటం. అదేదో తనకు ఆమెకి మధ్య ఏదో జరిగింది అన్న భావనలో ఉండటం ఆడియెన్స్ కు బొత్తిగా అర్ధం కాని టాపిక్ అవుతుంది. మరి బిగ్ బాస్ చూపించకుండా ఏమైనా దాచాడో ఏమో కాని అభిజిత్ మోనాల్ మీద వ్యక్తపరుస్తున్న ఆ అర్ధం కాని ఫీలింగ్ ఏంటన్నది మాత్రం ఆడియెన్స్ ను కన్ ఫ్యూజ్ అయ్యేలా చేస్తుంది. ఇక ఓ విధంగా చెప్పాలంటే అభిజిత్ పదే పదే మోనాల్ గురించి మాట్లాడి అతను ఆటలో వెనకప్డేలా చేస్తుందని అంటున్నారు.                                                   

మరింత సమాచారం తెలుసుకోండి: