బాలయ్య  బోయపాటి కాంబోలో నిర్మాణంలో ఉన్న బీబీ3 సినిమా ఈ మధ్య ఎక్కువగా రూమర్స్ తో రౌండప్ లు కొడుతోంది. ఆర్టిస్ట్ ల విషయంలో రకరకాల తారల పేర్లతో ఈ సినిమా హైలెట్ అవుతుంది. అయితే ఇప్పటివరకు ఎవరిని కన్ఫార్మ్ చేసింది. అనే విషయాన్ని మాత్రం మేకర్స్ చెప్పడం  లేదు. దీంతో రూమర్స్ కు మరింత అవకాశం ఇచ్చినట్లవుతుంది.

బాలయ్య, బోయపాటి కాంబో సినిమా రకరకాల గాసిప్స్ తో నెట్టింట్లో  హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో ఇప్పటి వరకు ఆర్టిస్ట్ ల విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. అయినప్పటికీ హీరోయిన్ దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల వరకు రకరకాల పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి. తాజాగా విలన్ గా సునీల్ శెట్టి పేరు లైమ్ లైట్లోకొచ్చింది. నిజానికి బోయపాటి సినిమాలో పవర్ ఫుల్ విలన్ ను రిక్రూట్ చేసుకోవాలని బోయపాటి బావిస్తున్నాడు. ఇంతకాలానికి సునీల్ శెట్టి రూపంలో మంచి విలన్ దొరికాడని టాక్ నడుస్తుంది.

సునీల్ శెట్టి విలన్ గా సెలెక్ట్ అయ్యింది లేనిది ఇంకా కన్ఫామ్ చేయలేదు. అలాగే బాలయ్య తమ్ముడి పాత్రకు నవీన్ చంద్ర ఓకే అయినట్లుగా చెబుతున్నారు. తమ్ముడిపాత్ర చనిపోవడంతోనే కథానాయకుడు సీరియస్ మోడ్ లోకి వస్తాడని .. యాక్షన్ ట్రాక్ స్టార్ట్ అవుతుందని నెట్టింట్లో అరవింద సమేత తరహాలో కథనాలు అల్లుతున్నారు. ఇంతలా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నా...బోయపాటి ఎక్కడా స్పందించింది లేదు.

ఇదే బాలయ్య సినిమా విషయంలో గతంలో ఇంటర్వల్ పార్ట్ గురించి గట్టిగా రూమర్స్ వెల్లువడ్డాయి. అందులో నారా రోహిత్
ఇంటర్వల్ పార్ట్ లో పోలీస్ ఆఫీసర్ అని కొందరు కాదు కాదు నెగిటివ్ షేడ్ ఉన్న ఎమ్ ఎల్ ఏ అని మరికొందరు పోస్టింగ్ ల మీద పోస్టింగ్ లు పెట్టారు. తాజాగా మీనా ఎపిసోడ్ లైమ్ లైట్లోకొచ్చింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాలయ్యకు జోడిగా మీనా నటించింది. గతంలో మీనా బాలయ్యకాంబోకు మంచి హిట్ పెయిర్ గా పేరుంది. మరి సినిమాలో కనిపించేది వీరిద్దరు కొంచెం సేపే అయినా అది ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: