టాప్ 5లో ముగ్గురు జెంట్స్, ఇద్దరు లేడీ హౌజ్ మేట్స్ ఉన్నారు. 16 మంది హౌజ్ మేట్స్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 4లో మరో ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా ఫైనల్ గా 19 మంది కంటెస్టంట్స్ లో టాప్ 5 గా వీరు ఉన్నారు. అయితే టాప్ 5 ఫైనలిస్టులలో ఒక్కొక్కరికి ఒక్కో గేం ప్లాన్ ఉందని చెప్పొచ్చు.
అభిజిత్ తనదైన ఆట తీరుతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా ఫిజికల్ టాస్కులు చేయకపోయినా సరే ప్రేక్షకులు తనలోని మెచ్యురిటీ లెవల్ ను చూసి అతనికి ఓటు వేస్తున్నారు. అంతేకాదు ఈ సీజన్ విన్నర్ గా అభిజిత్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. రన్నరప్ గా సోహెల్ ఉంటాడని ఆడియెన్స్ టాక్.
ఇక లేడీ హౌజ్ మేట్స్ లో హారిక, అరియానా ఇద్దరు మగాళ్లకు టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ఈ సీజన్ లో విన్నర్ గా లేడీ కంటెస్టంట్ ఉండాలని అనుకుంటున్నారు. అయితే ఇద్దరిలో ఎవరికి ఆ ఛాన్స్ దక్కుతుంది అన్నది కూడా చూడాలి. ప్రస్తుతానికి అరియానాకి రన్నరప్ గా నిలిచే ఛాన్స్ ఉందని కొందరు అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి