విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేసిన సూపర్ హిట్ మల్టీస్టారర్ ఎఫ్-2. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో సినిమాకు సీక్వల్ గా మరో సినిమా ప్లాన్ చేశారు. ఎఫ్3 అంటూ రాబోతున్న ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటుగా మరో హీరో కూడా నటిస్తాడని తెలుస్తుంది.

ఎఫ్-3 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటుగా రవితేజ, గోపీ చంద్ ఇద్దరిలో ఒకరు నటిస్తారని అంటున్నారు. అయితే ముందు థర్డ్ హీరోది ఫుల్ లెంగ్త్ రోల్ అనుకోగా అది కుదరదని నిర్ణయించుకుని మూడవ హీరోని గెస్ట్ రోల్ చేసేలా ప్లాన్ చేశారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం గోపీచంద్ ఎఫ్3లో గెస్ట్ రోల్ చేస్తాడని తెలుస్తుంది.

గోపీచంద్ తో పాటుగా రవితేజ కూడా ఎఫ్3లో చేస్తాడని డిస్కషన్స్ నడుస్తున్నాయి. మరి ఎఫ్3లో ఫైనల్ గా ఎవరు ఉంటారన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా చేస్తారని తెలుస్తుంది. ఈ సీక్వల్ లో డబ్బుతో వచ్చే సమస్యలతో ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా సినిమా చేస్తారని తెలుస్తుంది. మరి ఎఫ్3లో ఆ థర్డ్ హీరో ఎవరన్నది తెలియాల్సి ఉంది. వెంకటేష్ ఎఫ్3 కన్నా ముందు నారప్ప సినిమా చేస్తున్నాడు. వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సర్ సినిమా చేస్తున్నాడు. 2021 జనవరిలో ఎఫ్3 సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: