బిగ్ బాస్ సీజన్ 4 వచ్చే ఆదివారం ఫైనల్ ఎపిసోడ్ జరుగనుంది. ఈ ఫైనల్ ఎపిసోడ్ చాలా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ కు ఇప్పటికే స్టార్ హీరోని గెస్ట్ గా ఫిక్స్ చేయగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆ రోజు స్పెషల్ పర్ఫార్మెన్స్ గా హీరోయిన్స్ తో కూడా డ్యాన్సులు వేయిస్తున్నారని తెలుస్తుంది. ఈ సీజన్ లో దసరా స్పెషల్ ఎపిసోడ్ కు పాయల్ తో డ్యాన్స్ ప్లాన్ చేసిన బిగ్ బాస్ టీం ఫైనల్స్ లో కూడా ఇలానే స్పెషల్ డ్యాన్స్ షోస్ ప్లాన్ చేశారట.

అయితే ఈసారి మెహ్రీన్ కౌర్, రాయ్ లక్ష్మిలతో డ్యాన్స్ పర్ఫార్మ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ ఫైనల్స్ లో వీరి డ్యాన్స్ లో ఆడిటోరియం దద్దరిల్లిపోతుందని చెబుతున్నారు. హీరోయిన్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అది కూడా స్పెషల్ గా బిగ్ బాస్ ఫైనల్స్ కోసం అంటే స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు. సీజన్ 4 ఫైనల్ వీక్ లో ఐదుగురు హౌజ్ మేట్స్ ఉన్నారు. అయితే వీరిలో ఫైనల్ విన్నర్ ఎవరన్నది మాత్రం వచ్చే ఆదివారం తెలుస్తుంది.

అయితే బయట ఓటింగ్స్ లో మాత్రం అభిజిత్ ను విన్నర్ గా డిసైడ్ చేసేలా ఉన్నా అఫీషియల్ ఓటింగ్స్ లెక్క వేరేలా ఉంటుందని మాత్రం అనిపిస్తుంది. చివరి వారం హౌజ్ మేట్స్ కు ఎలాంటి టాస్కులు లేకుండా జెస్ట్ ఎంటర్టైనింగ్ గా షో సాగించాలని ఫిక్స్ అయ్యారు. అందుకే మంగళవారం ఎపిసోడ్ లో ముందు సీజ్ఞల్లో కంటెస్టంట్స్ ను తీసుకొచ్చి స్పెషల్ అప్పియరెన్స్ గా ప్లాన్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: