మాస్టర్ , వకీల్‌సాబ్ సమ్మర్‌లో రావాల్సి ఉండగా.. కరోనా అడ్డుకుంది. అయితే.. మాస్టర్‌కు సంబంధించి టీజర్.. సాంగ్ రిలీజ్ కాగా.. వకీల్‌సాబ్ నుంచి మోషన్ పిక్చర్ ,లిరికల్ వీడియో మాత్రమే రిలీజ్ అయ్యాయి. మాస్టర్ మాదిరి వకీల్‌సాబ్ నుంచి మరిన్ని ప్రచార చిత్రాలు వస్తే.. ఈ లాయర్ గురించే ఎక్కువ మాట్లాడుకునేవారేమో.
ఈ ఏడాది నెటిజన్లు ఎక్కువ మాట్లాడుకున్న మూడో సినిమా వలిమై. హీరో అజిత్‌కు ఏమాత్రం ఫాలోయింగ్ తగ్గలేదు. జస్ట్ మోషన్ పిక్చర్‌తో వచ్చిన మహేశ్ 'సర్కారువారిపాట' నాలుగోస్థానంలో నిలిచింది. ఓటీటీలో క్లిక్ అయిన సూర్య ' సైరారై పోట్రు' ఐదో స్థానం దక్కించుకుంది. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాలను ఆర్‌ఆర్‌ఆర్.. పుష్ప.. సరిలేరు నీకెవ్వరు.. కెజిఎఫ్2.. దర్బార్ నిలిచాయి. రామ్‌చరణ్, ఎన్టీఆర్ వంటి ఇద్దరు స్టార్స్ వున్నా.. బాహుబలి2 వంటి సన్సేషన్ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న మూవీ అయినా.. ఆర్‌ఆర్‌ఆర్ ఎక్కవ మాట్లాడుకోలేదు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఆరో స్థానం దక్కడం అభిమానులకు అంతు చిక్కడం లేదు. మోషన్ పిక్చర్‌తోపాటు.. రెండు టీజర్స్ రిలీజ్ చేసినా.. ఆ రేంజ్‌లో ఆర్‌ఆర్‌ఆర్ గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం చిత్రయూనిట్‌కు షాక్ ఇచ్చింది.
ఈ లెక్కలతో డార్లింగ్ ఫ్యాన్స్ బిత్తరపోయారు. ఈ ఏడాది ఎక్కువమంది చర్చించుకున్న సినిమాల్లో.. ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ కనిపించలేదు. సాహో ఫ్లాప్ అయినా.. 100 కోట్లు కలెక్ట్ చేసిన స్టామినా ప్రభాస్‌ది. ఏదేమైనా సాహో ఫ్లాప్ డార్లింగ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసింది. ఈ క్రమంలో రాధే శ్యామ్ గురించి పట్టించుకోవడం లేదా? అనిపిస్తోంది.
మొత్తానికి సోషల్ మీడియా లెక్కలు స్టార్ హీరోలను అయోమయానికి గురిచేశాయి. ఈ తప్పు తమది కాదనీ అంతా కరోనాదే అని ఆ మహమ్మారిపై నింద వేసేస్తున్నారట. ఎందుకంటే ఎన్నో ప్లాన్స్ వేసుకొని సినిమా షూటింగ్ లకు సిద్ధమవుతుంటే.. కరోనా వచ్చి వాళ్ల ఆలోచనలను తలకిందులు చేసింది. ఆశలను ఆవిరి చేసింది. అందుకే తమ గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడం మానేసినట్టు టాక్ వినిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి