ఇక లేటెస్ట్ గా జెమిని టివి కోసం స్పెషల్ రియాలిటీ షో చేస్తున్నాడట ఎన్.టి.ఆర్. మీలో ఎవరు కోటీశ్వరుడు తరహాలో ఈ షో ఉంటుందని టాక్. ఎం.ఈ.కే మూడు సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకోగా జెమిని టివితో కొత్తగా అదే తరహాలో ఓ రియాలిటీ షో వస్తుందని తెలుస్తుంది. ఈ షోకి హోస్ట్ గా చేస్తున్నందుకు ఎన్.టి.ఆర్ కు భారీ పారితోషికం ఇస్తున్నారట. దాదాపు ఎపిసోడ్ కు 30 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది.
స్మాల్ స్క్రీన్ పై తారక్ షో చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. తప్పకుండా ఈ షో రేంజ్ వేరే లెవల్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు ఎన్.టి.ఆర్.. ఈ సినిమాతో నేషనల్ వైడ్ గా సత్తా చాటాలని చూస్తున్నాడు తారక్. ట్రిపుల్ ఆర్ తర్వాత త్రివిక్రం తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు ఎన్.టి.ఆర్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి