ఛానెల్ ఏదైనా సరే ఇంట్లో ఉన్న మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు టివి సీరియల్స్ ఎమోషనల్ డ్రామాలు వస్తూనే ఉంటాయి. సీరియల్ కు రేటింగ్ బాగా వస్తుంది అంటే చాలు అసలు అనుకున్న కథ మధ్యలో ట్విస్టులు చేర్చి ఆడియెన్స్ ను ఇంకా ఎట్రాక్ట్ అయ్యేలా చేస్తారు. ఈ సీరియల్స్ టైం లో ఆడవాళ్లని కదిలిస్తే భద్రకాళిల్లా ఫైటింగ్ కు దిగుతారని తెలిసిందే. చాలా తక్కువమంది సీరియల్స్ ను చూడకుండా ఉంటారని చెప్పొచ్చు. అయితే సీరియల్స్ లో కామన్ గా చూస్తే ఎక్కువగా లేడీ విలన్స్ ఉంటారు. ఇంటికి వచ్చిన కోడలిని బయటకు పంపించాలని అత్త.. లేదా తనకు కాబోయే బావని పెళ్లి చేసుకుందని మరదలు అతని అక్క కలిసి చేసే కుట్రలు, కుతంత్రాలు ఇలా టివి ఆన్ చేస్తే చాలు ఇలాంటి సీరియల్స్ తోనే నిండిపోతుంది.
సీరియల్స్ లో మగ విలన్స్ అనేది చాలా అరుదుగా జరుగుతుందని చెప్పొచ్చు. ఫలనా సీరియల్ టైం అని తెలిస్తే చాలు ఆ టైం కల్లా టీవిలకు అతుక్కుపోతారు ప్రేక్షకులు. అయితే ఓ రకంగా బయట కొన్ని సంబంధాలు దెబ్బతినడానికి ఈ సీరియల్స్ కూడా దోహదపడుతున్నాయని తెలుస్తుంది. మరి సీరియల్స్ లో లేడీ విలన్స్ తగ్గించి కథ మీద.. వెరైటీ కథనాల మీద దృష్టి పెడితే బెటర్ అని అంటున్నారు కొందరు బుల్లితెర ఆడియెన్స్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి