ఎమ్మెస్ రాజు అంటే ఒకప్పుడు బ్రాండ్ ప్రొడ్యూసర్ అనే చెప్పాలి.. ఒక పదేళ్ల క్రితం వరకు ఎమ్మెస్ రాజు నిర్మాతగా తీసిన సినిమాలు, కథపై ఆయనకు ఉండే పట్టు, ప్రొడక్షన్ పరంగా అయన క్రియేట్ చేసిన స్టాండర్డ్స్ వేరు. మహేష్ తో “ఒక్కడు”, ప్రభాస్ తో “వర్షం” లాంటి సూపర్ క్వాలిటీ బ్లాక్ బస్టర్ హిట్స్ ను ప్రొడ్యూస్ చేయడమే కాక.. ప్రభుదేవాను దర్శకుడిగా పరిచయం చేసిన ఘనత కూడా ఎమ్మెస్ రాజుదే. వరుస విజయాలు, ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న తరుణంలో తన స్టోరీ జడ్జ్ మెంట్ మీద కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ తో దర్శకత్వం వైపు అడుగులు వేయడం జరిగింది. ముందుగా ఓ కన్నడ సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగులో “వాన” టైటిల్ తో రీమేక్ చేసి డిజాస్టర్ చవిచూశాడు.
అనంతరం కుమారుడ్ని హీరోగా పరిచయం చేస్తూ “తూనీగ తూనీగ” అనే సినిమాను తెరకెక్కించి దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, తండ్రిగా బొక్క బోర్లా పడ్డారు. ఆ తర్వాత కొడుకును హీరోగా సెటిల్ చేయడం కోసం నానా అగచాట్లు పడ్డప్పటికీ పెద్దగా ఫలితం లభించలేదు. ఎట్టకేలకు ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్లు సినిమా తీసి హిట్ కొట్టాడు.. ఈయనకి ఇలాంటి హిట్లు ఎన్నో రావాలని కోరుకుందాం. ఇలాంటి మరెన్నో అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫోలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి