ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఎలాంటి గ్లామర్ పాత్రలు చెయ్యకుండా కేవలం తన నటనతో ఆకట్టుకుంది సాయి పల్లవి. చాలా ఎనెర్జిటిక్ గా నటిస్తూ హీరోలకి సమానంగా క్రేజ్ తెచ్చుకుంది సాయి పల్లవి. ప్రేమమ్ సినిమాతో యూత్ మనసులను కొల్లగొట్టింది.. తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకుంది సాయి పల్లవి. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.నాగచైతన్య హీరోగా ‘లవ్ స్టోరీ’ సినిమాను పూర్తి చేసింది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా తన సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ ని చాలా స్ట్రాంగ్ గా చూపిస్తుంటారు ఈ దర్శకుడు. కొత్త ఏడాదిలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. దీంతో పాటు రానా నటిస్తోన్న ‘విరాటపర్వం’ సినిమాలో సాయి పల్లవి కీలక పాత్రలో నటించింది.

ఈ సినిమాలో సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించబోతుంది. కథ ప్రకారం సాయి పల్లవి  పాత్రకి మంచి ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు నాని నటిస్తోన్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకి ఓకే చెప్పింది ఈ బ్యూటీ. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానుంది. ఇందులో హీరోతో సమానంగా ఈమె పాత్ర ఉంటుందని చెబుతున్నారు. ఒక దశలో నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తుందట. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాగర్ చంద్ర కాంబినేషన్ లో రాబోతున్న మలయాళం రీమేక్ లో కూడా సాయి పల్లవిని తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ నాలుగు సినిమాలతో పాటు మరో క్రేజీ ఆఫర్ అందుకుంది సాయి పల్లవి. కృష్ణవంశీ, గోపీచంద్ కాంబినేషన్ లో రాబోతున్న ‘అలిమేలు మంగ వెంకటరమణ’ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకున్నారు.

ఇదొక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అనే సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం ముందుగా కాజల్, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లను తీసుకోవాలనుకున్నారు. ఫైనల్ గా ఈ ఛాన్స్ సాయి పల్లవికి దక్కింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ బిజీ హీరోయిన్ అయిపోయింది.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ ఇండియా హెరాల్డ్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: