ఈమధ్య కాలంలో యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో ఎవరంటే అందరు చెప్పే పేరు ఒకటే అతనే విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు హిట్ అవగా.. అర్జున్ రెడ్డి అతన్ని స్టార్ అయ్యేలా చేసింది. ఆ సినిమాలో అతని నటనా ప్రతిభకు స్టార్స్ సైతం షాక్ అయ్యారని చెప్పొచ్చు. ఇక అదే జోష్ లో గీతా గోవిందం కూడా హిట్ అయ్యింది. అయితే ఆ తర్వాత టాక్సీవాలా కమర్షియల్ సక్సెస్ అవగా తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు మాత్రం సక్సెస్ అందుకోలేదు.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా విషయంలో జరుగుతున్న పరిణామాలు విజయ్ ఫ్యాన్స్ ను కంగారు పడేలా చేస్తున్నాయి. సినిమా అటు ఇటైతే విజయ్ కెరియర్ రిస్క్ లో పడే అవకాశం ఉంది. తప్పకుండా విజయ్ దేవరకొండ ఈ సినిమాతో హిట్ కొట్టాల్సిందే.

పూరీ సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆ నెక్స్ట్ సుకుమార్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ సినిమా మాత్రం అల్లు అర్జున్ పుష్ప తర్వాత సెట్స్ మీదకు వెళ్తుంది. పూరీ ఫైటర్ సినిమా సూపర్ హిట్ అయితేనే విజయ్ హంగామా నడుస్తుంది. బాలీవుడ్ లో సినిమా చేయకపోయినా విజయ్ కు క్రేజ్ రాగా ఫైటర్ తో ఆ ఇమేజ్ ను డబుల్ చేసుకోవాలని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ.

మరింత సమాచారం తెలుసుకోండి: