ఇప్పటికే ఈ సినిమా విడుదల లేట్ అవ్వడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా షూటింగ్ రెస్యూమ్ చేసిన తమ సినిమాను సంక్రాంతి బరిలో దించేందుకు ప్లాన్స్ వేసింది.అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, రవితేజ క్రాక్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ చిత్రాలు ఉన్నాయి. దీంతో కొంత తగ్గినట్లు అనిపిస్తోంది. మిగతా సినిమాలు ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశాయి. కానీ రంగ్ దే చిత్రబృందం నుంచి ఆ వైబ్రేషన్స్ లేవు. మరి ఈ చిత్రం సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నట్టే అనుకోవాలా అన్న డౌట్స్ వస్తున్నాయి. మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తున్నారో చూడాలి.
మరోవైపు తన అభిమాన నటుడు పవన్ కళ్యాన్ సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగుతుండడంతో ఆయనకు పోటీగా ఎందుకు అన్నట్లు తన సినిమా విడుదలను కొన్ని రోజులు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే థియేటర్స్ తెరవడంతో పెద్దగా జనాలు ఆసక్తి చూపించకపోవడం, దీనికి తోడు సంక్రాంతి బరిలో చాలా సినిమాలను నిలవడంతో సింగిల్ రిలీజ్ కోసం రంగ్ దే బృందం ప్లాన్ చేస్తోందని టాక్.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు...ఇక ఈ సినిమా తర్వాత నితిన్.. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో 'చెక్' అనే సినిమాలో నటిస్తున్నాడు..!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి