సూపర్ స్టార్ మహేశ్ బాబు  తీసుకున్న నిర్ణయం సరైనదా? కాదా అని తేలాలంటే ఒకట్రెండు సంవత్సరాలు పడుతుంది.  ఆ రెండు సినిమాలు హిట్‌ అయితే.. మహేశ్‌ ఫీల్‌ అవుతాడు. ఫ్లాప్‌ అయితే మాత్రం మంచి పని చేశాననంటూ.. తననితాను మెచ్చుకుంటాడు? పక్కవాళ్ల సినిమా హిట్‌ అయితే ఆనందపడిపోవడం ఏంటి? ఫ్లాప్‌ అయితే బాధపడడం ఏంటి? ఇలా ఆయన మూడ్ ఉంటోంది.  

సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి విచిత్రాలు చోటుచేసుకుంటాయి. చేతికొచ్చి వదిలేసుకున్న సినిమాలు సూపర్‌హిట్‌ అవుతాయి. టైం బాగుంటే ఫెయిల్‌ అవుతాయి. పెద్ద ఎన్టీఆర్‌ నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌ వరకు అందరూ ఈ సిట్యువేషన్ ఫేస్‌ చేసినవాళ్లే. మహేశ్‌ అయితే.. మూడు సినిమాలు వదిలేసుకున్నాడు. వాటిలో పుష్ప ఒకటి. రంగస్థలం హిట్‌ తర్వాత మహేశ్‌ మూవీకి కమిటైన సుకుమార్‌ ఏడాదిపాటు.. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌తో కథ రాసుకున్నాడు. అయితే లెక్కల మాష్టారి కథ మహేశ్‌కు ఇదినచ్చకపోవడంతో వదిలేసుకొని.. 'సర్కారువారి పాట'కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఇదే మూవీని బన్నీతో పుష్ప టైటిల్‌తో తీస్తున్నాడు సుకుమార్‌.

మహేశ్‌ రిజక్ట్ చేసిన మరో కథ బాలీవుడ్‌లో తెరకెక్కుతోంది. అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్ కబీర్‌సింగ్‌ సూపర్‌హిట్‌ తర్వాత సందీప్‌ వంగా మహేశ్‌కు ఓ కథ వినిపించాడు. అది నచ్చక వదిలేసుకున్నాడు. సందీప్‌ ప్రస్తుతం హిందీలో రణ్‌బీర్‌ కపూర్‌తో క్రైమ్‌ థ్రిల్లర్‌ ప్లాన్‌ చేశాడు. దర్శకుడు మహేశ్‌కు వినిపించిన కథ ఇదేనట.

పుష్ఫ కంటే ముందే మహేశ్‌ పూరీ జగన్నాథ్‌ 'జనగణమన' మూవీని వదిలేసుకున్నాడు. పోకిరి రిలీజై 10 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా పూరీ జనగణమనను ఎనౌన్స్ చేశాడు. ఇప్పుడీ కథను దర్శకుడు పవన్‌కల్యాణ్ తో తీస్తారన్న వార్తలు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ మూడు కథలు వదిలేసి మహేశ్‌ తీసుకున్న నిర్ణయం కరెక్టా? కాదా అని తెలియాలంటే.. రిలీజెస్‌ వరకు ఆగాల్సిందే. మొత్తానికి మహేశ్ బాబు తన టాలెంట్ కు మరింత పదును పెడుతున్నాడు.





మరింత సమాచారం తెలుసుకోండి: